కార్యకర్తల కోసం కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం
కాంగ్రెస్కార్యకర్తలందరికీ ఇన్సూరెన్స్కల్పించాలని పార్టీ నిర్ణయం తీసుకున్నది. రాజీవ్‌గాంధీ యాక్సిడెంట్స్కీమ్ను ఇంప్లిమెంట్ చేయాలని లీడర్ల నుంచి ఏఐసీసీకి ప్రపోజల్వెళ్లింది.
దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్కార్యకర్తలందరికీ ఇన్సూరెన్స్కల్పించాలని పార్టీ నిర్ణయం తీసుకున్నది. రాజీవ్‌గాంధీ యాక్సిడెంట్స్కీమ్ను ఇంప్లిమెంట్ చేయాలని లీడర్ల నుంచి ఏఐసీసీకి ప్రపోజల్వెళ్లింది. ఈ మేరకు శనివారం గాంధీభవన్‌లో నేషనల్ ఇండియా అష్యూరెన్స్ ఇన్సూరెన్స్ కంపెనీతో కాంగ్రెస్‌పార్టీ ముఖ్య నేతలు రివ్యూ నిర్వహించారు. అయితే ప్రజలకూ ఇన్సురెన్స్ సౌకర్యం కల్పిస్తే మేలు జరుగుతుందని పార్టీలోని కొంతమంది నేతలు తీర్మానించినట్లు సమాచారం. ఇదిలా ఉండగా, రాజీవ్ గాంధీ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ స్కీమ్‌ను ఏప్రిల్ 1న 2022 ప్రారంభించారు. దీన్ని ఇప్పుడు విస్తృతం చేయాలని పార్టీ నిర్ణయం తీసుకున్నది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్లీడర్లు చామలకిరణ్ కుమార్ రెడ్డి, ఇన్సూరెన్స్ డిపార్ట్మెంట్ చైర్మన్ పవన్ మల్లాది, ఇన్సూరెన్స్ కోఆర్డినేటర్స్ మధుసూదన్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.