హౌస్ ట్యాక్స్ కట్టని యజమాని.. అధికారులు ఏం చేశారంటే?
దిశ, డైనమిక్ బ్యూరో: ప్రభుత్వం నిబంధనల ప్రకారం ప్రజలు ట్యాక్స్‌లు చెల్లించాల్సి ఉంటుందన్న విషయం తెలిసిందే. అందులో భాగం
దిశ, డైనమిక్ బ్యూరో: ప్రభుత్వం నిబంధనల ప్రకారం ప్రజలు ట్యాక్స్‌లు చెల్లించాల్సి ఉంటుందన్న విషయం తెలిసిందే. అందులో భాగంగా ఇంటి పన్ను, నీటి పన్ను ఇతర పన్నులను ప్రభుత్వం వసూలు చేస్తుంటుంది. ఈ క్రమంలో కొత్త ఆర్థిక సంవత్సరం మొదలుకాబోతున్న వేళ గత బకాయిలను వసూలు చేసేందుకు అధికారులు సిద్ధం అయ్యారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని మున్సిపాలిటీలు పెండిగ్‌లో ఉన్న ఇళ్లకు వెళ్లి పన్ను చెల్లించాల్సిందిగా సూచిస్తున్నారు. అయితే, పన్ను వసూలు చేసేందుకు వెళ్లిన అధికారులు.. ఇళ్లలో ఉన్న సామాన్లు తీసుకెళ్తున్న వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఓ ఇంటి యజమాని గత మూడేళ్లుగా ఇంటిపన్ను చెల్లించడం లేదని, వారికి ముందుగా నోటీసులు ఇచ్చామని వీడియోలో అధికారి చెప్పుకొచ్చారు. అయితే, ఇంటి యజమాని ఇంటి పన్ను కట్టకపోతే తమ సామాన్లు తీసుకెళ్తూ దౌర్జన్యం చేస్తున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ వీడియో తీశారు. అయితే, దీనిని బీజేపీ నేతలు పోస్ట్ చేస్తూ..ఇదే విధంగా పాతబస్తీలో కరెంట్ బిల్లు, ఇంటి పన్నును వసూలు చేసే దమ్ము మీకుందా అంటూ మంత్రి కేటీఆర్‌ను ప్రశ్నిస్తున్నారు.
House Tax కట్టట్లేదు అని అది ఉన్నవాళ్ళ ఇంట్లో సామాను తీసుకెళ్తున్నారు అధికారులు...
— Anusha (@Anusha4BJP) March 31, 2022
ఇదే రకంగా పాత బస్తిలో Current Bill/House Tax వసూలు చేసే దమ్ము మీకు ఉందా చెప్పండి @KTRTRS pic.twitter.com/lR8BBmOFTI