విద్యార్థి నిరుద్యోగ మార్చ్‌ను అడ్డుకున్న ఓయూ పోలీసులు.. పలువురు అరెస్ట్

విద్యార్ది నిరుద్యోగ మార్చ్‌ను ఓయూ‌లోనే అడ్డుకొని వారిని పోలీసులు అరెస్టు చేశారు.

Update: 2023-03-24 04:14 GMT

దిశ, సికింద్రాబాద్: ఆర్ట్స్ కళాశాల నుండి గన్ పార్క్ వరకు నిర్వహించ తలపెట్టిన విద్యార్ది నిరుద్యోగ మార్చ్‌ను ఓయూ పోలీసులు అడ్డుకున్నారు. శుక్రవారం ఓయూ‌లోనే విద్యార్థి జేఏసీ నాయకులను అడ్డుకొని వారిని అరెస్టు చేశారు. విద్యార్ది జేఏసి నాయకులు భీంరావు నాయక్, మిడతన పల్లి విజయ్, బండి నరేష్, కె.వెంకట్ యాదవ్‌లను స్థానిక ఓయూ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముప్పై లక్షల పైగా విద్యార్థి నిరుద్యోగులు ఆవేదన పడుతుంటే ఇప్పటివరకు రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించకపోవడం బాధాకరం ఆన్నారు.

టీఎస్పీఎస్సీ పరీక్ష పత్రాలు లీకేజీకి మూలకారకులైన చైర్మన్ సభ్యులను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. యావత్ విద్యార్ది నిరుద్యోగ లోకం నిరసనలు తెలుపుతున్నా కేసీఆర్ పట్టించుకోకపోవడం సిగ్గు చేటు అన్నారు. లీకేజీ వ్యవహారంపై సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. వెంటనే ఉద్యోగల భర్తీ క్యాలెండర్ ప్రకటించాలని, రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రతి నిరుద్యోగికి రాష్ట్ర ప్రభుత్వం రూ.లక్ష రూపాయల భృతిని ప్రకటించాలని డిమాండ్ చేశారు. గ్రూప్-1 క్యాలిఫై అయిన అభ్యర్థులను వెంటనే నష్ట పరిహారం ప్రకటించి న్యాయం చేయాలని కోరారు. అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని, ఇది ఉస్మానియా గడ్డ అని గుర్తుంచుకోవాలన్నారు.

ఇవి కూడా చదవండి: బ్రేకింగ్ : రేవంత్ రెడ్డి హౌస్ అరెస్ట్

Tags:    

Similar News