ప్రారంభానికి సిద్ధమైన పార్లమెంట్ కొత్త భవనం.. ముహూర్తం ఎప్పుడంటే?

ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న పార్లమెంట్ భవనం ప్రారంభానికి సిద్ధమైంది.

Update: 2023-05-02 06:41 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న పార్లమెంట్ భవనం ప్రారంభానికి సిద్ధమైంది. ఈ నెలఖారుకు దీనిని ప్రారంభించేందుకు కేంద్రం ప్రణాళికలు రచిస్తోంది. ప్రారంభోత్సం కోసం ఏర్పాట్లను ఇప్పటికే అధికారులు ప్రారంభించారు. రూ.14లక్షలతో ఇనాగరేషన్ సందర్భంగా పూలతో పార్లమెంట్ భవన సముదాయాన్ని అలంకరించనున్నారు. అయితే త్వరలోనే ప్రారంభోత్సవ తేదీని ప్రకించనున్నట్లు తెలిసింది. పార్లమెంట్ కొత్త భవనం నిర్మాణం దాదాపు పూర్తి కాగా నిర్మాణ అనంతర పరిశీలన పెండింగ్ లో ఉంది. కేంద్ర గృహ, పట్టణ శాఖ కార్యదర్శి మనోజ్ జోషి, సీపడబ్ల్యూడీ డీజీ శైలేంద్ర శర్మ పనులను పరిశీలించారు.

పార్లమెంట్ నూతన భవనాన్ని ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు. పార్లమెంట్ భవనం సహా సెంట్రల్ సెక్రటేరియట్, కొత్త ఆఫీస్ లు, ప్రధాని నివాసం, ఉపరాష్ట్ర పతి ఎన్ క్లేవ్ లను సిద్ధం చేస్తున్నారు. వీటితో పాటు కేంద్ర ప్రభుత్వ భవనాలను నిర్మిస్తున్నారు. ఒకేసారి 1,224 మంది ఎంపీలో కూర్చునేలా కొత్త పార్లమెంట్ భవనాన్ని నిర్మిస్తున్నారు. లోక్ సభలో 888, రాజ్యసభలో 384 మంది కూర్చునేలా నిర్మాణాలు చేపడుతున్నారు. పార్లమెంట్ కొత్త భవనం ప్రారంభోత్సవ తేదీపై కేంద్ర ప్రభుత్వ వర్గాల నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.

Tags:    

Similar News