Harish Rao: డెయిరీలో అతి చేస్తున్న పోలీసుల పేర్లు.. హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు
అక్రమ కేసులకు భయపడేది లేదని, ఎన్ని కేసులు పెట్టుకున్నా ఎగవేతల రేవంత్ రెడ్డి అనే పిలుస్తానని మాజీ మంత్రి హరీష్ రావు(EX Minister Harish Rao) అన్నారు.
దిశ, డైనమిక్ బ్యూరో: అక్రమ కేసులకు భయపడేది లేదని, ఎన్ని కేసులు పెట్టుకున్నా ఎగవేతల రేవంత్ రెడ్డి అనే పిలుస్తానని మాజీ మంత్రి హరీష్ రావు(EX Minister Harish Rao) అన్నారు. వనపర్తి(Wanaparthy)లో నిర్వహించిన రైతాంగ, ప్రజా నిరసన సదస్సులో పాల్గొన్న ఆయన ప్రభుత్వం(Telangana Govt)పై విమర్శల వర్షం గుప్పించారు. ఈ సందర్భంగా.. కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) వచ్చాక కొత్త పథకాలు(New Schemes) రాలేదు. ఉన్న పథకాలు బంద్(Close) పెడుతున్నారని, బీఆర్ఎస్(BRS) ప్రశ్నిస్తుంది కనుక ఆ మాత్రం అయినా చేస్తున్నారని తెలిపారు. సగం మందికి కూడా రుణమాఫీ కాలేదని, కేసీఆర్ అందరికీ రైతు బంధు ఇస్తే.. రేవంత్ రెడ్డి ఎగవేశారని చెప్పారు. రైతులను మోసం చేసిన నువ్వు ఎనుముల రేవంత్ రెడ్డి(Anumula Revanth Reddy) కాదు ఎగవేతల రేవంత్ రెడ్డి అని వ్యాఖ్యానించారు.
హామీలు అడిగితే బేగం బజార్ పోలీసు స్టేషన్(Begam Bazar PS) లో కేసులు పెట్టారని, నా మీద ఎన్ని కేసులు పెట్టినా హామీలు ఇచ్చేదాక నిన్ను ఎగవేతల రేవంత్ రెడ్డి అని పిలుస్తానని స్పష్టం చేశారు. అన్ని వర్గాలను రోడ్ల మీదకు తెచ్చారని, జివో 29(GO 29) తెచ్చి ఎస్సీ(SC), ఎస్టీ(ST) లకు ఉద్యోగాలు(Jobs) రాకుండా చేస్తున్నారని, అన్యాయం అంటే పిల్లల ఈపులు పగల కొడుతున్నారని తెలిపారు. పోలిసోల్లను నమ్మడం లేదని, స్పెషల్ పోలీసులను తొలగించి ఆత్మవిశ్వాసం మీద దెబ్బ కొట్టారని, ముఖ్యమంత్రి(CM)గా సమస్యలు పరిష్కరించడంలో ఫెయిల్(Fail) అయ్యారని దుయ్యబట్టారు. ఇక అక్రమ కేసులకు భయపడేది లేదని, తెలంగాణ భవన్(Telangana Bhavan) లో లీగల్ సెల్(Leagal Cell) ఏర్పాటు చేశామని, అతి చేస్తున్న పోలీసుల పేర్లు డెయిరీలో రాస్తున్నామని హరీష్ రావు హెచ్చరించారు.