ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు బెయిల్ పిటిషన్ విత్ డ్రా చేసుకున్న నిందితులు

రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో ట్విస్ట్ నమోదు చేసుకుంది.

Update: 2024-04-15 10:18 GMT

దిశ, డైనమిక్ బ్యూరో:రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో ట్విస్ట్ నమోదు చేసుకుంది. ఈ కేసులో అరెస్ట్ అయి రిమాండ్ లో ఉన్న నిందితులు దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్లను విత్ డ్రా చేసుకున్నారు. ఈ కేసులో పోలీసులు సెక్షన్ 70 ఐటీ యాక్ట్ నమోదు చేయడంతో ఒక్కొక్కరికి 10 సంవత్సరాల కంటే ఎక్కువై జైలు శిక్ష పడే అవకాశాలు ఉన్నాయి. దీంతో సెషన్ కోర్టుకు వెళ్లాలని నాంపల్లి ఏసీఎంఎం కోర్టు సూచనతో వారు తమ బెయిల్ పిటిషన్లను విత్ డ్రా చేసుకున్నారు. ఈ నేపథ్యంలో వీరు రేపు నాంపల్లి సెషన్స్ కోర్టులో తాజాగా బెయిల్ పిటిషన్ దాఖలు చేయనున్నారు. కాగా ఈ కేసులో మాజీ డీసీపీ రాధా కిషన్ రావు, మాజీ అడిషనల్ ఎస్పీలు భుంజగరావు, మాజీ డీఎస్పీ ప్రణీత్ రావులను పోలీసులు ఇదివరకే అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. వీరు ప్రస్తుతం రిమాడ్ ఖైదీలుగా ఉన్నారు.

Tags:    

Similar News