వారసత్వంలో వెనబడిన కీలక నేతలు.. ఈ సారి వారి భవితవ్యమేంటీ?

రాజకీయాల్లో పదునైన ప్రసంగాలు, ప్రజలను మెప్పించగలిగే వాగ్ధాటి ఉండాల్సిందే..

Update: 2023-03-04 08:02 GMT

దిశ, వెబ్‌డెస్క్: రాజకీయాల్లో పదునైన ప్రసంగాలు, ప్రజలను మెప్పించగలిగే వాగ్ధాటి ఉండాల్సిందే.. మనం ఏం చెప్పదలుచుకుంటున్నామో అది ప్రజల్లోకి సూటిగా వెళితే రిజల్ట్ ఓ రేంజ్ లో ఉంటుంది. పాలిటిక్స్‌లో తమ స్థానాన్ని కాపాడుకుంటూనే ప్రత్యర్థుల ఎత్తుగడలను ఎప్పటికప్పుడు కౌంటర్ ఇవ్వాల్సిందే. విషయ పరిజ్ఞానం అన్ని అంశాలపై ఉంటే ప్రతి అంశంపై సూటిగా మాట్లాడి ప్రజలను మెప్పించగలం.

కాగా అటు జాతీయ రాజకీయాల్లో రాహుల్ గాంధీ ఈ విషయంలో వెనకబడ్డారనే చెప్పొచ్చు. గత రెండు పర్యాయాలు ఆయన ముందుడి నడిపించిన కాంగ్రెస్ జాతకాన్ని మార్చలేకపోయారు. సోనియా గాంధీ వారసుడిగా అప్పటికే రెండు పర్యాయాలు గెలిచిన కాంగ్రెస్ కు నాయకత్వ బాధ్యతలు తీసుకున్న ఆయన తన వాగ్ధాటిలో మరింత పదును పెంచాల్సి ఉంది. ఇటీవల దేశవ్యాప్తంగా జోడో యాత్ర నిర్వహించిన ఆయన ప్రసంగాలు తేలిపోయాయి. కాంగ్రెస్ పార్టీలో కూడా నూతనోత్తేజం తేవడంలో జోడో యాత్ర పెద్దగా దోహదపడలేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

ప్రధాని మోడీకి ప్రత్యామ్నాయ నేత అని కాంగ్రెస్ వర్గాలు చెప్పుకుంటున్నా ఆ మేరకు ప్రభావం చూపడంలో మాత్రం రాహుల్ గాంధీ విఫలం అవుతున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ మరింత దూకుడు పెంచాల్సి ఉన్నా ఆ మేరకు గ్రౌండ్ వర్క్ జరగడం లేదనే భావన నెలకొంది. కాంగ్రెస్ సంస్థాగతంగా బలంగా ఉన్న నాయకత్వ లేమి కారణంగా తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఈ దఫా ఎన్నికలు సమీపిస్తున్న వేళ మరి రాహుల్ గాంధీ నిర్ణయాలు ఎలా ఉంటాయి.

దూకుడు పెంచుతారా అనేది చూడాల్సి ఉంది. కాంగ్రెస్ ను ఒంటి చేత్తో గెలిపించే సత్తా లేని నాయకుడు లేకపోవడంతో గత రెండు పర్యాయాలు అధికారం మిస్ కాగా ఈ సారి కూడా బీజేపీ దూకుడుగా వ్యవహరిస్తోంది. వరుసగా జరుగుతున్న ఆయా రాష్ట్రాల్లో విజయఢంకా మోగిస్తూ దూసుకెళ్తుంది. దీంతో వచ్చే ఎన్నికలు కాంగ్రెస్ కు సవాల్ గా మారాయి. ఈ దఫా తమ సత్తా చాటకుంటే రాహుల్ భవితవ్యమేంటనే ఆందోళన ఆ పార్టీలో నెలకొంది.

లోకేష్ అలా.. కేటీఆర్ దూకుడు 

ఇదిలా ఉంటే.. చంద్రబాబు వారసుడిగా నారా లోకేష్ సైతం రాజకీయ నేతగా ఎస్టాబ్లిష్ కాలేకపోతున్నారు. పదునైన వాగ్ధాటి లేకపోవడంతో ఇప్పటికి సీఎం జగన్‌కు ప్రత్యామ్నాయం కాలేకపోతున్నారు. యువగళం పాదయాత్ర సందర్భంగా ఆయన మరింత పదును పెంచి ప్రసంగించాల్సి ఉంది. దూకుడు మంత్రమే ప్రస్తుతం రాజకీయాల్లో ట్రెండ్ గా నడుస్తున్న వేళ అధికార పక్షాన్ని ఆయా అంశాల వారీగా కార్నర్ చేస్తే మరింత ఫలితాలుంటాయి. అయితే గత ఎన్నికల్లో మంగళగిరి నుంచి ఓడిపోయిన నారా లోకేష్ కు ఈ ఎన్నికలు కీలకం కానున్నాయి. పొలిటీషియన్‌గా తన సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్న వేళ ఈ దఫాలో ఖచ్చితంగా గెలవాల్సిన అనివార్యత నెలకొంది.

ఇదే తెలంగాణ విషయానికొస్తే కేసీఆర్‌కు వారసుడిగా కేటీఆర్ దూకుడుగా వ్యవహరిస్తున్నారు. కేసీఆర్ తర్వాత కేటీఆర్ సీఎం అని ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు భావిస్తున్నారు. దూకుడు ప్రసంగాలు, సూటిగా మాట్లాడటం, అంశాల వారీగా పట్టు ఉండటం కేటీఆర్‌కు కలిసొస్తున్న అంశం అయితే వీటితో పాటు ప్రతిపక్షాలను ఎప్పటికప్పుడు ఎండగట్టడం ప్లస్ పాయింట్. రాహుల్ గాంధీ, లోకేష్‌తో పోలిస్తే కేటీఆర్ ప్రజల్లో మంచి గుర్తింపు ఉన్నా రానున్న ఎన్నికలు ఈ ముగ్గురు నేతలకు కీలకం కానున్నాయి.  

Tags:    

Similar News