డేటా చౌర్యొం కేసులో విచారణ ముమ్మరం
డేటా లీకేజీ కేసులో సైబరాబాద్పోలీసులు విచారణను ముమ్మరం చేస్తున్నారు. సైబరాబాద్కమిషనర్స్టీఫెన్రవీంద్ర ఈ కేసు విచారణ కోసం డీసీపీ కల్మేశ్వర్నేతృత్వంలో సిట్‌ను ఏర్పాటు చేశారు.
దిశ, తెలంగాణ క్రైం బ్యూరో : డేటా లీకేజీ కేసులో సైబరాబాద్పోలీసులు విచారణను ముమ్మరం చేస్తున్నారు. సైబరాబాద్కమిషనర్స్టీఫెన్రవీంద్ర ఈ కేసు విచారణ కోసం డీసీపీ కల్మేశ్వర్నేతృత్వంలో సిట్‌ను ఏర్పాటు చేశారు. తాజాగా సిట్అధికారులు 66 కోట్లమందికి పైగా ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని తస్కరించి వేర్వేరు సంస్థలు, వ్యక్తులకు తెగనమ్ముకున్న వినయ్భరద్వాజ్ని క్షుణ్నంగా విచారించాలని నిర్ణయించారు. ఈ క్రమంలో అతన్ని కస్టడీకి అప్పగించాలంటూ కోర్టులో పిటీషన్‌దాఖలు చేశారు. మరోవైపు నోటీసులు అందుకున్న పదకొండు సంస్థల ప్రతినిధులను 5, 6, 7 తేదీల్లో తప్పనిసరిగా విచారణకు హాజరు కావాలని సూచించారు. వీరిని విచారించటానికి నలభై ప్రశ్నలతో జాబితాను సిద్ధం చేశారు.
సైబరాబాద్ పోలీసులు ఇటీవల హర్యానా రాష్ర్టం నొయిడా కేంద్రంగా ప్రజలతోపాటు ఆర్మీ, నేవీ, కీలక ప్రభుత్వ శాఖల ఉద్యోగుల డేటాను సేకరించి అమ్ముకుంటున్న వినయ్భరద్వాజ్ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. రక్షణ శాఖ ఉద్యోగులు, డాక్టర్లు, ఆదాయం పన్ను కడుతున్నవారితోపాటు కీలక ప్రభుత్వ శాఖల ఉద్యోగుల వ్యక్తిగత సమాచారాన్ని వినయ్భరద్వాజ్వేర్వేరు మార్గాల్లో తస్కరించి అమ్ముకుంటున్నట్టుగా వెల్లడైంది. దేశ జనాభాలో సగం మందికి పైగా డేటా వినయ్ భరద్వాజ్వద్ద దొరకటంతో ఇటు కేంద్ర హోంమంత్రిత్వ శాఖతోపాటు అటు ఐటీ శాఖ కూడా ఈ కేసుపై దృష్టిని సారించాయి. కేసు విచారణ వివరాలను ఎప్పటికప్పుడు తెలియచేయాలని సైబరాబాద్పోలీస్కమిషనర్కు సూచించాయి. ఈ క్రమంలోనే వినయ్భరద్వాజ్ను మరింత నిశితంగా విచారించాలని నిర్ణయించిన సిట్అధికారులు అతన్ని కస్టడీకి అప్పగించాలంటూ కోర్టులో పిటీషన్‌దాఖలు చేశారు.
తప్పనిసరిగా రావాల్సిందే..
వినయ్భరద్వాజ్కు ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజలకు సంబంధించిన డేటాను ఇచ్చినట్టుగా భావిస్తున్న పదకొండు సంస్థలకు ఆదివారం నోటీసులు జారీ చేశారు. ఇందులో బిగ్‌బాస్కెట్, ఫోన్‌పే, ఫేస్బుక్, క్లబ్మహీంద్రా, పాలసీ బజార్, యాక్సిస్‌బ్యాంక్, అస్ట్యూట్గ్రూప్, మ్యాట్రిక్స్, బ్యాంక్ఆఫ్బరోడా, స్టేట్బ్యాంక్ఆఫ్ఇండియా, టెక్‌మహీంద్రా సంస్థలు ఉన్నాయి. ఈనెల 5, 6, 7 తేదీల్లో ఖచ్చితంగా విచారణకు హాజరు కావాలని ఆయా నోటీసుల్లో స్పష్టంగా పేర్కొన్నారు. ఈ సంస్థల ప్రతినిధులను విచారించేందుకు నలభై ప్రశ్నలను సిద్ధం చేసినట్టుగా సమాచారం.