అన్ని పిటిషన్లను కొట్టేసిన హైకోర్టు

గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహించకుండా స్టే ఇవ్వాలని మంగళవారం హైకోర్టులో మరో పిటిషన్ దాఖలయ్యింది. దీనిని విచారణకు స్వీకరించిన కోర్టు పరీక్షపై స్టే ఇవ్వటానికి నిరాకరించింది.

Update: 2023-06-06 17:15 GMT

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహించకుండా స్టే ఇవ్వాలని మంగళవారం హైకోర్టులో మరో పిటిషన్ దాఖలయ్యింది. దీనిని విచారణకు స్వీకరించిన కోర్టు పరీక్షపై స్టే ఇవ్వటానికి నిరాకరించింది. ఇంతకు ముందు 36 మంది అభ్యర్థులు గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను రెండు నెలల పాటు వాయిదా వెయ్యాలని పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత మరికొందరు పరీక్ష రద్దు చెయ్యాలని పిటిషన్లు వేశారు. ఈ అన్ని పిటిషన్లను సోమవారం హైకోర్టు కొట్టివేస్తూ ఉత్తర్వులు ఇచ్చిన విషయం తెలిసిందే.

Tags:    

Similar News