పదేళ్లలో సాధించిన వృద్ధి ఏడాదిలోనే కుదేలు.. హరీష్ రావు కీలక వ్యాఖ్యలు

పదేళ్లలో సాధించిన వృద్ధిని ఒక్క ఏడాదిలోనే దెబ్బతీశారని, ముఖ్యమంత్రి తొందరపాటు నిర్ణయాలే ఇందుకు కారణమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు (BRS Leader Harish Rao) అన్నారు.

Update: 2025-04-06 13:42 GMT

దిశ, వెబ్ డెస్క్: పదేళ్లలో సాధించిన వృద్ధిని ఒక్క ఏడాదిలోనే దెబ్బతీశారని, ముఖ్యమంత్రి తొందరపాటు నిర్ణయాలే ఇందుకు కారణమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు (BRS Leader Harish Rao) అన్నారు. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ (Stamps And Registrations Dept)లో ఆదాయ క్షీణతపై ట్విట్టర్ వేదికగా స్పందించిన హరీష్ రావు.. పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా ఆయన.. బీఆర్ఎస్ ప్రభుత్వ (BRS Government) హయాంలో తెలంగాణ స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ గడిచిన పది సంవత్సరాల్లో వార్షిక వృద్ధిరేటు 25.62 శాతం సాధించిందని, రేవంత్ రెడ్డి (Revanth Reddy) అధికారంలోకి వచ్చాక, 2024–25 ఆర్థిక సంవత్సరంలో ఈ శాఖ ఆదాయంలో 1.93 శాతం తగ్గుదల నమోదవడం వారి అనాలోచిత నిర్ణయాలకు నిదర్శనమని మండిపడ్డారు. రాష్ట్ర అభివృద్ధితో పాటు హైదరాబాద్ ప్రతిష్ఠను దెబ్బతీసే ముఖ్య కారణాల వల్ల ఇలా జరిగిందని తెలిపారు.

హైడ్రా (Hydraa) పేరుతో పేద, మధ్య తరగతి ఇండ్లు కూల్చడం, మూసీ రివర్ ఫ్రంట్ (Moosi River Front) అంటూ నగర అభివృద్ధిపై బుల్డోజర్ ఎక్కించడం, మెట్రో లైన్ ప్రణాళిక (Metro Line Plans)ల్లో అనవసర మార్పులు చేసి మౌలిక వసతుల ప్రగతిని అడ్డుకోవడం, రాష్ట్రానికి కీలకమైన ఫార్మా సిటీ (Farma City)ని రద్దు చేయడం వల్ల పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు కోల్పోవడమే ఇందుకు కారణమని అన్నారు. ఈ తొందరపాటు నిర్ణయాల కారణంగా ఒకప్పుడు వేగంగా ఎదిగిన తెలంగాణ ఇప్పుడు వెనుకబాటుకు గురయ్యే పరిస్థితి ఏర్పడిందని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ హయాంలో అమలు చేసిన ప్రణాళికలను పక్కనబెట్టి, అరుదైన అవకాశాలను కోల్పోతున్నారని, రాష్ట్రాభివృద్ధిని కాపాడుకోవాలంటే స్పష్టమైన దిశా నిర్దేశంతో మౌలిక వసతులను పటిష్ఠంగా మెరుగుపరచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే (BRS MLA) స్పష్టం చేశారు. 

Tags:    

Similar News