రాహుల్ గాంధీ పై వ్యాసం మా మనోభావాలు దెబ్బతిసింది: టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్
ఈ దేశ ప్రధాని పదవిని తిరస్కరించిన రాహుల్ కుటుంబం ఎందులో తక్కువగా కనిపిస్తుందో మీకే తెలియాలి?.. ఆయన వ్యాసంలో రాహుల్ గాంధీ మీద ఎందుకు అలా రాశారో అర్థం కావడం లేదు, ఆరేకే పలుకు ప్రామాణికం, ఆయనంటే గౌరవం అని టీపీసీసీ ఛీప్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో : ఈ దేశ ప్రధాని పదవిని తిరస్కరించిన రాహుల్ కుటుంబం ఎందులో తక్కువగా కనిపిస్తుందో మీకే తెలియాలి?.. ఆయన వ్యాసంలో రాహుల్ గాంధీ మీద ఎందుకు అలా రాశారో అర్థం కావడం లేదు, ఆరేకే పలుకు ప్రామాణికం, ఆయనంటే గౌరవం అని టీపీసీసీ ఛీప్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఆదివారం ఆయన గాంధీ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆంధ్రజ్యోతి పత్రికలో లోకసభ ప్రతిపక్షనేత రాహుల్ గాంధీపై వచ్చిన ఆర్‌కే పలుకు వ్యాసంపై తీవ్రంగా స్పందించారు. ఏ శక్తులు రాయించారో? ఆయన పలుకు కనిపించ లేదు.. మోదీ పలుకులు మాత్రమే కనిపించాయని అన్నారు. ఆయన పలుకులో రాహుల్ గాంధీ పై మీద వచ్చిన వ్యాసం కాంగ్రెస్ కార్యకర్తల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉందని పేర్కొన్నారు.
అపార అనుభవం ఉన్న ఆర్‌కే, రాహుల్ గాంధీ తీరును అర్థం చేసుకోకపోవడం బాధాకరమని వ్యాఖ్యనించారు. కులం, మతం పేరిట రెండుసార్లు అధికారంలోకి వచ్చారు.. ఏరకమైన పాలను కొనసాగిస్తున్నారో మీకు తెలియనిది కాదన్నారు. మీ వ్యాసం వెనుక ఎవరో ఉన్నారో అనుమానం కలుగక తప్పడం లేదన్నారు. ఏవరినో ఈ రాష్ట్రంలో పెంచే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తున్నదన్నారు. రాహుల్ గాంధీని తగ్గించి మోడీని పెంచితే ఈ దేశం లాభపడుతుందా? అని ప్రశ్నించారు. ఆయన వ్యాసంలో రాహుల్ గాంధీ మీద ఎందుకు ? అలా రాశారో అర్థం కావడం లేదన్నారు. పెద్దన్నలా రాహుల్ గాంధీకి వెన్నుదన్నులా నిలవాల్సింది పోయి ఇలా చేయడం శ్రేయస్కరం కాదన్నారు.
సమాజ శ్రేయస్సు కోసం వ్యాసాలు రాసే ఆర్‌కే, రాహుల్ గాంధీ మీద ఇలాంటి రాతలు రాయడం మంచికాదన్నారు. ఆయనతో ఏ శక్తులు రాయించారో దేవుడికీ తెలియలి అని అన్నారు. ఎవరి లబ్ధి కోసం వ్యాసం రాశారో తెలియదు అన్నారు. నెహ్రూ అంటే ఇండిపెండెంట్ ఇంటిగ్రేషన్ తరహాలో అభివృద్ధి పనులు చేశారని తెలిపారు. గరిబ్ హటావో నినాదంతో ఇందిరా గాంధీ అభివృద్ధి పనులు చేశారని గుర్తు చేశారు. సోషల్ జస్టిస్ పేరుతో రాహుల్ గాంధీ కొట్లడితే ఎక్కడ మిస్టేక్ జరిగిందో అర్థం కావడం లేదన్నారు. దేశ సంపద 90 శాతం ఇద్దరు చేతుల్లో ఉండిపోయిందన్నారు. కమ్యూనిష్టులు అధికారంలోకి రాకపోయినా పేదోడికి న్యాయం జరుగాలని పోరాడుతున్నారన్నారు.
కులం మతం పేరిట చిచ్చు పెట్టే వారికంటే రాహుల్ గాంధీ ఎందుకో తక్కువ చెప్పాలన్నారు. రాహుల్ గాంధీ కార్పొరేట్స్ సెక్టార్ కి వ్యతిరేకం కాదు అని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతం సమానత్వం అని పేర్కొన్నారు. జీసస్ క్రైస్ట్ కంటే ఎక్కువ రాహుల్ గాంధీ మీద రాళ్ళు పడ్డ సమానత్వం కోసం కృషి చేస్తున్నారని తెలిపారు. రాహుల్ గాంధీకి పెద్దన్నలా సూచనలు చేయాల్సింది పోయి ఇలాంటి రాతలు రాయడం బాధాకరం అన్నారు. ఆర్కే వ్యాసం వెనక ఎవరున్నారో తెలియదు..ఎవరి మెప్పు కోసం రాశారో ఆయన అంతరాత్మకు తెలియాలి అన్నారు. ఆయన వ్యాసం తో ప్రతి కాంగ్రెస్ కార్యకర్త మనోభావాలు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు.
అణగారిన వర్గాల కోసం కుల సర్వే రాహుల్ గాంధీ కలలు కనడం తప్పా? మరొకటి లేదన్నారు. 42 శాతం రిజర్వేషన్ల కోసం కృషి చేసే రాహుల్ గాంధీ ఎలా తక్కువగా కనపడుతున్నారా? అని అన్నారు. బీసీ ల రిజర్వేషన్లకు అడ్డుపడే మోదీ ఎందులో ఎక్కువగా కనిపిస్తున్నారన్నారు. మతం లేకుంటే, ఆ మతాన్ని వాడకుంటే ఈ దేశానికి ప్రధాని అవుతారా? అన్నారు. రాహుల్ గాంధీ జీవితం త్యాగాల మయం అన్నారు. ఆయన తలుచుకుంటే ఆనాడే ప్రధాని అయ్యేవారన్నారు. కానీ మనోమోహన్ సింగ్ ను ప్రధానిని చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రధాని పదవిని తిరస్కరించిన రాహుల్ కుటుంబం ఎందులో తక్కువగా కనిపిస్తుందో మీకే తెలియాలని ఆరేకే ను ఈ సందర్భంగా ప్రశ్నించారు. ఈ వ్యాసం వెనుక ఎవరోనున్నారో? తెలంగాణ ప్రజలు అర్ధం చేసుకోవాలన్నారు. రాహుల్ గాంధీ తగ్గించే ప్రయత్నం ఎంత మాత్రం సమంజసం కాదన్నారు.