మొబైల్‌లోనే ఇందిరమ్మ ఇండ్ల స్టేటస్.. ఒక్క క్లిక్‌తో టోటల్ సమాచారం
మీరు ఇందిరమ్మ ఇల్లు (Indiramma houses)కోసం దరఖాస్తు (Application)చేశారా? అయితే మీకో గుడ్ న్యూస్.

దిశ, వెబ్‌డెస్క్: మీరు ఇందిరమ్మ ఇల్లు (Indiramma houses)కోసం దరఖాస్తు (Application)చేశారా? అయితే మీకో గుడ్ న్యూస్. మీ అప్లికేషన్ స్టేటస్ ఏంటి, సర్వే పూర్తయిందా?(Survey of Indiramma houses), ఇల్లు మంజూరైందా? అయితే ఎన్నో జాబితాలో వస్తుంది. ఒకవేళ మంజూరు కాకుంటే ఎందుకు రాలేదు.. వంటి వివరాల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పనిలేదు. మీ చేతిలో సెల్‌ఫోన్ ఉంటే చాలు.. చిటికెలో పై వివరాలన్నీ పొందవచ్చు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పిస్తూ ఓ వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తెచ్చింది. https://indirammaindlu.telangana.gov.in అనే వెబ్‌సైట్‌లోకి వెళ్లి అప్లికేషన్ సెర్చ్‌పై క్లిక్ చేయాలి. అక్కడ ఆధార్ నంబర్/ మొబైల్ నంబర్/రేషన్ కార్డు నంబర్ ఎంటర్ చేస్తే అప్లికేషన్ స్టేటస్ వివరాలు కనిపిస్తాయి. సర్వే కంప్లీట్ అయిందా? ఎన్నో లిస్ట్‌లో ఉంది.. వంటి వివరాలు వస్తాయి. దరఖాస్తుదారులు ఏమైనా అభ్యంతరాలు ఉంటే ‘రైజ్ గ్రీవెన్స్’(Raise Grievances)పై క్లిక్ చేసి ఫిర్యాదు చేయవచ్చు.