జోడో యాత్రను ఏ శక్తీ ఆపలేదు: రాహుల్ గాంధీ
తెలంగాణలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ తొలిరోజు పాదయాత్ర ముగిసింది. నారాయణపేట జిల్లా గుడబెల్లూరులో పాదయాత్రకు బ్రేక్ పడింది. తొలిరోజు తెలంగాణలో రాహుల్ గాంధీ
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ తొలిరోజు పాదయాత్ర ముగిసింది. నారాయణపేట జిల్లా గుడబెల్లూరులో పాదయాత్రకు బ్రేక్ పడింది. తొలిరోజు తెలంగాణలో రాహుల్ గాంధీ నాలుగు కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అందరికీ సమాన హక్కుల కోసమే పాదయాత్ర చేస్తున్నట్లు రాహుల్ గాంధీ అన్నారు. తమిళనాడు, కేరళ, కర్నాటక ప్రజలు భారత్ జోడో యాత్రను ఆదరించారని తెలిపారు. ఈ యాత్రను ఏ శక్తీ ఆపలేదని ధీమా వ్యక్తం చేశారు. దేశంలో ఆర్ఎస్ఎస్, బీజేపీలు మత విద్వేశాలు రెచ్చగొట్టి రాజకీయ పబ్బం గడుపుకుంటున్నాయని విమర్శించారు. దేశంలో హింసకు తావులేదని, కాంగ్రెస్ అధికారింలోకి వచ్చాక అద్భుతమైన మార్పులు చూస్తారని అన్నారు. తిరిగి రాహుల్ గాంధీ యాత్ర 27వ తేదీన పున:ప్రారంభం కానుంది.
ఇవి కూడా చదవండి: జోడో యాత్రను ఏ శక్తీ ఆపలేదు: రాహుల్ గాంధీ