గోవా వెళ్లాల్సిన ప్రయాణికులకు షాక్ ఇచ్చిన డ్రైవర్.. ప్రైవేట్ ట్రావెల్స్‌పై కంప్లైంట్
గోవా వెళ్తున్న ప్రయాణికులకు ప్రైవేటు ట్రావెల్స్ బస్సు డ్రైవర్ షాక్ ఇచ్చాడు.
దిశ, వెబ్‌డెస్క్: గోవా వెళ్తున్న ప్రయాణికులకు ప్రైవేటు ట్రావెల్స్ బస్సు డ్రైవర్ షాక్ ఇచ్చాడు. బస్సులో సౌకర్యాలపై ప్రశ్నించినందుకు ప్రయాణికుల పట్ల దురుసుగా ప్రవర్తించాడు. అంతటితో ఆగకుండా అశోక్ నగర్‌లో బస్సు దిగి డ్రైవర్ వెళ్లిపోయాడు. దీంతో ఓం సాయి ట్రావెల్స్‌పై ప్రయాణికులు ఫిర్యాదు చేశారు. రామచంద్రాపురం పోలీసు స్టేషన్‌కు చేరుకుని ప్యాసింజర్లు కంప్లైంట్ చేశారు. తమకు ప్రత్యామ్నాయం కల్పించకపోవడంతో 100 నెంబర్‌కు ప్రయాణికులు తొలుత ఫోన్ చేశారు. రామచంద్రాపురం పీఎస్ వద్ద రాత్రంతా పిల్లలతో ప్రయాణికులు పడిగాపులు కాశారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.