దేశం ఒక ప్రజా పోరాట యోధుడిని కోల్పోయింది : మంత్రి సీతక్క

భారత రాజకీయాల్లో ప్రముఖ వ్యక్తిగా గుర్తింపు పొందిన సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మరణంతో.. ఈ దేశం ఒక ప్రజా పోరాట యోధుడిని కోల్పోయిందని రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క పేర్కొన్నారు.

Update: 2024-09-13 17:00 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: భారత రాజకీయాల్లో ప్రముఖ వ్యక్తిగా గుర్తింపు పొందిన సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మరణంతో.. ఈ దేశం ఒక ప్రజా పోరాట యోధుడిని కోల్పోయిందని రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క పేర్కొన్నారు. శుక్రవారం ములుగు పర్యటలనలో ఉన్న మంత్రి సీతక్క.. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. దశాబ్దాలుగా అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడుతూ భారత కమ్యునిస్టు రాజకీయాలపై చెరగని ముద్ర వేసిన ప్రజా ఉద్యమకారుడు సీతారాం ఏచూరి అని చెప్పారు. ఇలాంటి గొప్ప నాయకుడిని కోల్పోవడం నిజంగా భాధాకరమని వ్యాఖ్యానించారు. విలువలు, సిద్ధాంతాల కలబోతగా తన రాజకీయ ప్రస్థానాన్ని చివరి వరకు కొనసాగించిన సీతారాం ఏచూరి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలన్నారు.


Similar News