Nirmal : లోయలో పడ్డ కారు.. ముగ్గురిని రక్షించిన పోలీసులు

ఆదివారం తెల్లవారుజాము 2 గంటలకు హైదరాబాద్ నుండి నాగపూర్ వెళ్తున్న కారు నిర్మల్ సమీపంలోని మహబూబ్ ఘాట్ రెండవ సెక్షన్‌లో పొగ మంచు ఎక్కువ రావడంతో దారి కనిపించక అదుపు తప్పి లోయలో పడిపోయింది.

Update: 2024-07-21 04:06 GMT

దిశ ప్రతినిధి, నిర్మల్ : ఆదివారం తెల్లవారుజాము 2 గంటలకు హైదరాబాద్ నుండి నాగపూర్ వెళ్తున్న కారు నిర్మల్ సమీపంలోని మహబూబ్ ఘాట్ రెండవ సెక్షన్‌లో పొగ మంచు ఎక్కువ రావడంతో దారి కనిపించక అదుపు తప్పి లోయలో పడిపోయింది. డయల్ 100 ద్వారా నిర్మల్ కంట్రోల్ రూమ్‌కి సమాచారం రావడంతో వెంటనే అప్రమత్తం అయిన నిర్మల్ డిసిఆర్‌బీ ఇన్స్పెక్టర్ గోపినాథ్, సారంగాపూర్ ఎస్సై శ్రీకాంత్ వెళ్లి వారిని లోయలో గుర్తించారు.

అనంతరం కారులో ఉన్న రాధాకృష్ణ ఆయన భార్య, కుమారుడిని కాపాడారు. ముగ్గురికి స్వల్ప గాయాలు అయ్యాయి. హైదరాబాద్ సరూర్ నగర్‌కి చెందిన వారిని నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఇన్స్‌పెక్టర్ గోపీనాథ్, శ్రీకాంత్ ఎస్ఐ సారంగాపూర్, పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ డా.జానకి షర్మిల అభినందించారు. ఘటన విషయం తెలుసుకున్న వెంటనే జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి సీతక్క ఆరా తీశారు. బాధితులకు అండగా ఉండాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు.

Tags:    

Similar News