ఎమ్మెల్యేల కోనుగోలు కేసులో హీట్ పెంచిన న్యాయవాదులు..
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఇరువురి తరపు న్యాయవాదుల వాదనలు వాడీవేడీగా సాగాయి
దిశ, డైనమిక్ బ్యూరో : టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఇరువురి తరపు న్యాయవాదుల వాదనలు వాడీవేడీగా సాగాయి. ఈ కేసులో విచారణకు హాజరు కావాలని సిట్ జారీ చేసిన నోటీసులను సవాలు చేస్తూ తుషార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నేడు విచారణ జరిపిన ధర్మాసనం.. తుషార్‌ను అరెస్ట్ చేయవద్దని, అదే సమయంలో విచారణకు సహకరించాలని తుషార్‌ను కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఇరువురి తరపు న్యాయవాదుల వాదనలు హాట్‌హట్‌గా జరిగాయి. ఈ కేసు తీవ్ర నేరమైన కేసు.. బీజేపీకి సంబంధం లేదు అంటే విచారణకు సహకరించాలి కదా అంటూ ప్రభుత్వ తరుపున న్యాయవాది దుశ్యంత్ దవే అన్నారు. కేసు నమోదైన మరుక్షణం నుంచే బీజేపీ కేసును వీక్ చేసే ప్రయత్నం చేసిందన్నారు.
ఎమ్మెల్యేల కొనుగోలుపై పక్కా ఆధారాలు ఉన్నాయని తెలిపారు. కుట్రలు బయటపడడంతోనే బీజేపీ ఆందోళన చెందుతోందని, ప్రభుత్వం ప్రమాదంలో పడుతుంటే ఊరుకుంటారా? అంటూ ప్రశ్నించారు. ఇలా కొనుగోళ్లు జరుగుతూ పోతుంటే ప్రజాస్వామ్యం ఖూనీ కాదా అని దవే తీవ్ర స్థాయిలో ప్రశ్నలను సంధించారు. బీజేపీకి సంబంధం లేదు అంటూనే..నిందితుల తరుపున పిటిషన్స్ వేస్తున్నారంటూ దవే వ్యాఖ్యానించారు. గడిచిన కొన్నేళ్లలో అనేక ప్రభుత్వాలను బీజేపీ పడగొట్టిందన్నారు. ఇతర పార్టీ ఎమ్మెల్యేలను కొని చార్టెడ్ ఫ్లైట్స్‌లో తీసుకెళ్లి ప్రభుత్వాలను పడగొట్టారంటూ న్యాయస్థానికి తెలిపారు.
కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గోవాలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసారన్నారు. బీజేపీ ఎన్నికల మ్యానిఫెస్టోలో మాత్రం అవినీతికి పాల్పడం అని చెప్పారన్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ న్యాయవాది ద్యుశాంత్ వాదనలను బీజేపీ న్యాయవాది జెఠ్మలానీ అడ్డుకున్నారు. పలు హైకోర్టుల, సుప్రీంకోర్టుల వాదనలను ప్రస్తావించారు. ప్రస్తుతం దర్యాప్తు జరుగుతున్న తీరు ఫెయిర్‌గా లేదు.. సీఎం కనుసన్నల్లో జరుగుతుందని, సీవీ ఆనంద్ సీరియస్‌గా లేరని వాదనలు వినింపించారు. ఫామ్‌హౌజ్ సంఘటన నుంచి ఇప్పటివరకు జరుగతున్న దర్యాప్తులో పారదర్శకత లేదని ఉదాహరణలను ప్రస్తావించారు. సీడీలు, ఆధారాలను మీడియాకు బహిర్గతం చేసి కోర్టులకు అందజేయడాన్ని జెఠ్మలానీ తప్పుపట్టారు. ఇదంతా చట్టానికి విరుద్ధంగా జరుగుతున్నదన్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరు న్యాయవాదుల మధ్య వాదనలు తీవ్రం కావడంతో జడ్జి జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. వాదనలు గద్గద స్వరంతో వద్దని జడ్జి సూచించారు.
READ MORE
మంత్రి హరీష్ రావు పాల్గొన్న కార్యక్రమంలో బీజేపీ-టీఆర్ఎస్ బాహాబాహి!