వారిద్దరికీ ఉద్యోగం కల్పించిన యువతకు ధన్యవాదాలు!.. బీఆర్ఎస్ నేత కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
వారిద్దరికీ ఉద్యోగం కల్పించిన యువతకు ధన్యవాదాలు అని మీరు ఆందోళన చేస్తుంటే వారు ఎక్కడ ఉన్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
దిశ. డైనమిక్ బ్యూరో: వారిద్దరికీ ఉద్యోగం కల్పించిన యువతకు ధన్యవాదాలు అని మీరు ఆందోళన చేస్తుంటే వారు ఎక్కడ ఉన్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఆర్టీసీ క్రాస్ రోడ్ లో నిరుద్యోగ యువకులు ధర్నా చేసిన ఘటనపై ఎక్స్ వేదికగా స్పందించిన ఆయన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌కు చెందిన ఇద్దరు రాజకీయ నిరుద్యోగ మోసగాళ్లు చందమామను చూపించి వాగ్దానం చేసి తెలంగాణ యువతను కేసీఆర్ ప్రభుత్వంపై రెచ్చగొట్టారని అన్నారు. ఇప్పుడు ఆ ఇద్దరికీ మంచి ఉద్యోగాలు ఉన్నాయని, ఇందుకు యువతకు ధన్యవాదాలు అంటూ వ్యంగ్యంగా రాసుకొచ్చారు. ఇక గత 7 నెలల్లో, ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలంటూ వాగ్దానం చేసిన దాని నుంచి ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ లేదా ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని ఆరోపించారు. ఇక హైదరాబాద్ వీధుల్లో తెలంగాణ యువత పెద్దఎత్తున ఆందోళన చేస్తుంటే వారు ఎక్కడున్నారు? అని ప్రశ్నించారు. కాగా గ్రూప్-2 పరీక్ష వాయిదా వేయాలని నిరుద్యోగులు శనివారం రాత్రి చిక్కడ్ పల్లి నుంచి అశోక్ నగర్ చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్టీసీ క్రాస్ రోడ్ వద్ద బైఠాయించి ధర్నా నిర్వహించారు.