TGSRTC: ఆడపిల్లలపై బస్ కండక్టర్ బూతు పురాణం.. డిపోలో ఫిర్యాదు చేసిన విద్యార్ధినులు

ఆడపిల్లలు అని చూడకుండా ఆర్టీసీ కండక్టర్ బూతులు తిడుతున్నారని, మద్యలో దింపేస్తున్నాడని, విద్యార్ధినులు డిపోలో ఫిర్యాదు చేశారు.

Update: 2024-08-14 13:01 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ఆడపిల్లలు అని చూడకుండా ఆర్టీసీ కండక్టర్ బూతులు తిడుతున్నారని, మద్యలో దింపేస్తున్నాడని, విద్యార్ధినులు డిపోలో ఫిర్యాదు చేశారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నుండి కేశంపేట మండలంలోని సంగెం గ్రామానికి ఉదయం సాయంత్రం వేళల్లో ఆర్టీసీ స్పెషల్ బస్సు నడుస్తుంది. ఆ బస్సులో ఆయా గ్రామాల నుండి విద్యార్థి, విద్యార్థినిలు చదువుకోవడానికి షాద్ నగర్ ప్రాంతానికి వెళ్లి వస్తుంటారు. అయితే ఈ విద్యార్ధినుల పట్ల రాములు అనే బస్ కండక్టర్ బూతు మాటలు తిడుతూ ఉంటారని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆధార్ అప్ డేట్ లేకపోయినా, బ్యాగ్‌లో నుండి ఆధార్ బయటకు తీయడంలో ఆలస్యమైనా బండబూతులు తిడతారని చెప్పారు. మంగళవారం సంగెం తండా వద్ద మధ్యలోనే బస్సును ఆపి దింపి వేశాడని, ఆడపిల్లలు అని చూడకుండా దుర్భాషలాడాడని షాద్ నగర్ ప్రభుత్వ పాఠశాల విద్యార్ధినులు వాపోయారు. దీనిపై షాద్ నగర్ ఆర్టీసీ డిపోలో ఫిర్యాదు చేశామని దయచేసి రాములు అనే కండక్టర్ పై చర్యలు తీసుకోవాలని బాలికలు కోరారు.

Tags:    

Similar News