టీజీఎస్ ఆర్టీసీ ఫేక్ లోగో ప్రచారం.. ఇద్దరిపై కేసు నమోదు
టీఎస్ ఆర్టీసీ నుంచి టీజీ ఆర్టీసీగా మారినట్లు సోషల్ మీడియాలో ఫేక్ లోగోను రూపొందించి తప్పుడు ప్రచారం చేస్తున్న ఇద్దరిపై చర్యలు తీసుకోవాలని టీజీ ఆర్టీసీ అధికారులు గురువారం చిక్కడిపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
దిశ, క్రైమ్ బ్యూరో: టీఎస్ ఆర్టీసీ నుంచి టీజీఎస్ ఆర్టీసీగా మారినట్లు సోషల్ మీడియాలో ఫేక్ లోగోను రూపొందించి తప్పుడు ప్రచారం చేస్తున్న ఇద్దరిపై చర్యలు తీసుకోవాలని టీజీ ఆర్టీసీ అధికారులు గురువారం చిక్కడిపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. గురువారం ఉదయం 11 గంటల సమయంలో X (ట్వీటర్ లో) కొణతం దిలీప్, హరీష్ బీఆర్ఎస్ యూఎస్ఏ-హరీష్ రెడ్డి ఐడీలలో టీజీ ఆర్టీసీ ఫేక్ లోగోను రూపొందించి పెట్టారు. టీజీఎస్ ఆర్టీసీ లోగోను ఆ సంస్థ ఇంకా అధికారికంగా ప్రకటించ లేదు. అంతే కాకుండా ఆ ఐడీలో అభ్యంతకరమైన పదాలతో తయారు చేసిన వీడియోను పెట్టారు. ఇది ఆర్టీసీ కార్పొరేషన్‌కు, ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చే విధంగా ఉందని టీజీ ఆర్టీసీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ శ్రీధర్ గుర్తించారు. ఇలా ఫేక్ వీడియోను వారి సోషల్ మీడియా ఖాతాల ద్వారా ప్రచారం చేస్తున్న కొణతం దిలీప్, హరీష్ రెడ్డిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని చిక్కడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు వారిపై ఎఫ్ఐఆర్ 188/2024 కింద ఐటీ యాక్ట్, ఐపీసీల అభియోగాలను మోపుతూ కేసు నమోదు చేశారు.