ప్రయాణికులకు టీజీఆర్టీసీ గుడ్ న్యూస్.. ఇక నుంచి అందుబాటులోకి ఆ సేవలు

ప్రయాణికులకు టీజీ ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. పల్లె, సిటీ బస్సుల్లో ఆన్ లైన్ పేమెంట్ మెథడ్‌ను త్వరలో అందుబాటులోకి తేనున్నట్లు ప్రకటించింది.

Update: 2024-07-12 03:36 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రయాణికులకు టీజీ ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. పల్లె, సిటీ బస్సుల్లో ఆన్ లైన్ పేమెంట్ మెథడ్‌ను త్వరలో అందుబాటులోకి తేనున్నట్లు ప్రకటించింది. ఆగస్టులోగా సిటీ సర్వీసుల్లో ఈ సేవలు స్టార్ట్ కానున్నాయి. స్టేట్ వైడ్‌గా అన్ని జిల్లాల్లో సెప్టెంబర్ నాటికి ఈ విధానాన్ని విస్తరించాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఇందుకుగాను ఆర్టీసీ కండక్టర్లకు ఐ-టిమ్స్‌ను అందించేందుకు వేగంగా ఏర్పాట్లు చేస్తోంది. దీంతో పాటు త్వరలోనే మహాలక్ష్మీ స్కీమ్‌లో భాగంగా మహిళా ప్రయాణికులకు స్మార్ట్ కార్డులు అందజేయనున్నారు. ఈ కార్డును స్వైప్ చేయడం ద్వారా జీరో టికెట్లు పొందే అవకాశం కల్పించనున్నారు. కొత్తగా ప్రవేశపెట్టనున్న ఐ-టిమ్స్‌తో డెబిట్ కార్డులను వినియోగించుకుని చెల్లింపులు చేయొచ్చు. క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా యూపీఐ పేమెంట్స్ చేసే వెసులుబాటు కల్పించనున్నారు. హైదరాబాద్‌ పరిధి బండ్లగూడ, దిల్‌సుఖ్‌నగర్ సిటీ బస్సులకు ఐ-టిమ్స్‌ను పైలెట్ ప్రాజెక్టు కింద అందజేశారు.      


Similar News