BREAKING: గ్రూప్-2, 3 పరీక్షల వాయిదాపై TGPSC కీలక ప్రకటన

తెలంగాణలో గ్రూప్-2, గ్రూప్-3 పరీక్షలు వాయిదా పడినట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. దీంతో అభ్యర్థులు తీవ్ర గందరగోళంలో

Update: 2024-07-10 12:40 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో గ్రూప్-2, గ్రూప్-3 పరీక్షలు వాయిదా పడినట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. దీంతో అభ్యర్థులు తీవ్ర గందరగోళంలో పడిపోయారు. ఈ నేపథ్యంలో గ్రూప్స్ పరీక్షలు పోస్ట్‌పోన్ అయినట్లు జరుగుతోన్న ప్రచారంపై ఎట్టకేలకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) క్లారిటీ ఇచ్చింది. గ్రూప్-2, 3 పరీక్షలు వాయిదా వేశారన్న ప్రచారాన్ని టీజీపీఎస్సీ ఖండించింది. తెలంగాణలో యథావిధిగా గ్రూప్-2, 3 పరీక్షలు జరుగుతాయని స్పష్టం చేసింది. పరీక్షలు వాయిదా పడినట్లు సోషల్ మీడియాలో జరుగుతోన్న ప్రచారాన్ని అభ్యర్థులు ఎవరూ నమ్మొద్దని సూచించింది.

కాగా, డీఎస్సీ, గ్రూప్స్ పరీక్షలు వెంట వెంటనే ఉంటడంతో ప్రిపేర్ అయ్యేందుకు సమయం లేదని.. ఏదో ఒక పరీక్షను వాయిదా వేయాలని గత కొన్ని రోజులుగా నిరుద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నిరుద్యోగుల డిమాండ్‌కు ప్రభుత్వం సానుకూలంగా స్పందించి.. గ్రూప్స్ పరీక్షలను పోస్ట్ పోన్ చేసిందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంతో అభ్యర్థులు అయోమయంలో పడిపోగా.. తాజాగా ఈ ఇష్యూపై స్పందించిన టీజీపీఎస్సీ పరీక్షలు వాయిదా పడినట్లు జరుగుతోన్న ప్రచారమంతా ఫేక్ అని.. యథావిధిగా గ్రూప్-2, 3 పరీక్షలు జరుగుతాయని స్పష్టం చేసింది. టీజీపీఎస్సీ తాజాగా క్లారిటీతో గ్రూప్-2, 3 పరీక్షల నిర్వహణపై నెలకొన్న గందరగోళానికి తెరపడింది. 


Similar News