TG Govt.: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. ఆ రంగుల్లో కొత్త రేషన్ కార్డులు

రాష్ట్ర ప్రజలకు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కొత్త రేషన్ కార్డుల (New Ration Cards)పై తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) కీలక ప్రకటన చేసింది.

Update: 2025-03-14 03:55 GMT
TG Govt.: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. ఆ రంగుల్లో కొత్త రేషన్ కార్డులు
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కొత్త రేషన్ కార్డుల (New Ration Cards)పై తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు ఏప్రిల్ (April) నుంచి కొత్త కార్డు పంపిణీ ఉండొచ్చని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy) తెలిపారు. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న వారికీ బీపీఎల్ (Below Poverty Line) కార్డులు, ఎగువన ఉన్న వారికి ఏపీల్ (Above Poverty Line) కార్డులు ఇవ్వాలని నిర్ణయించినట్లుగా పేర్కొన్నారు. కొత్త రేషన్ కార్డుల జారీ విషయంలో ఎవరికీ ఎలాంటి అపోహలు అవసరం లేదని.. అర్హులందరికీ రేషన్ కార్డులు అందజేస్తామని తేల్చి చెప్పారు. ఇప్పటికే పింక్ కార్డులు ఉన్నా వారికి గ్రీన్ కలర్ కార్డులు, తెల్ల కార్డులు ఉన్న వారికి ట్రై కలర్ కార్డులు ఇస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. 

Tags:    

Similar News