TG Govt: రైతులకు భారీ గుడ్‌న్యూస్.. రుణమాఫీకి మార్గదర్శకాలు సిద్ధం!
ఎన్నికల్లో ఇచ్చి హామీ మేరకు అన్నదాతలకు రూ.2 లక్షల రుణ మాఫీ చేసేందుకు ప్రభుత్వం నడుంబిగించింది.
దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికల్లో ఇచ్చి హామీ మేరకు అన్నదాతలకు రూ.2 లక్షల రుణ మాఫీ చేసేందుకు ప్రభుత్వం నడుంబిగించింది. ఈ మేరకు మార్గదర్శకాలను సైతం సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది. పీఎం కిసాన్ యోజన పథకాన్ని బేస్ చేసుకుని యూనిట్ వారీగా సర్కార్ రుణమాఫీ చేసేందుకు పక్కాగా పథకం రచిస్తున్నారు. అయితే, ఓ రైతు పేరు మీద రుణాలు గరిష్ఠంగా ఎన్ని ఉన్నప్పటికీ రూ.2 లక్షల వరకు మాఫీ చేయాలని నిర్ణయించారు. అందుకు ప్రామాణికంగా రేషన్ కార్డు, వ్యవసాయ శాఖ వద్ద ఇప్పటికే పొందుపరిచిన డేటాతో సరిపోల్చి రుణమాఫీ చేయనున్నారు. కాగా, ప్రభుత్వ మార్గదర్శకాలు విడుదలైన మరు క్షణమే రుణమాఫీకి జిల్లాల వారీగా అధికారులు, సంబంధింత బ్యాంకు అధికారులతో కలిసి లబ్ధిదారుల జాబితాలను సిద్ధం చేయనున్నారు. అనంతరం ఆ జాబితాలు గ్రామ పంచాయతీలు వేదికగా గ్రామ సభలో చర్చించిన తరువాతే అప్రువల్ కోసం జిల్లా కలెక్టర్ వద్దకు వెళ్తాయి.