TG Budget-2024 : నేడు రాష్ట్ర బడ్జెట్.. ఆ 6 రంగాలకు టాప్ ప్రిఫరెన్స్

తెలంగాణలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ తొలిసారి అసెంబ్లీలో బడ్జెట్‌ను నేడు(గురువారం) ప్రవేశపెట్టనుంది.

Update: 2024-07-25 02:42 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ తొలిసారి అసెంబ్లీలో బడ్జెట్‌ను నేడు(గురువారం) ప్రవేశపెట్టనుంది. మొత్తం బడ్జెట్ రూ.2.75లక్షల కోట్లతో రూపొందించగా పూర్తి స్థాయి బడ్జెట్ రూ.2.96లక్షల కోట్లకు పెరగవచ్చని తెలుస్తోంది. గురువారం ఉదయం 9 గంటలకు జరిగే కేబినెట్ భేటీలో బడ్జెట్‌కు ఆమోదం తెలపనున్నారు. మంత్రి వర్గం ఆమోదించిన తర్వాత మధ్యాహ్నం 12 గంటలకు అసెంబ్లీలో డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్‌ను ప్రవేశపెట్టునున్నారు. శాసనమండలిలో మంత్రి శ్రీధర్ బాబు బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.

కాంగ్రెస్ సర్కారు మెజార్టీ కేటాయింపులు ఈ శాఖలకే..

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు కాంగ్రెస్ సర్కారు వ్యవసాయ రంగానికి పెద్ద పీట వేయనున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా రుణమాఫీకి రూ.30 వేల కోట్లు, రైతు భరోసాకు రూ.15 వేల కోట్లు కేటాయించనున్నట్లు తెలుస్తోంది. సంక్షేమ శాఖలకు రూ.40 వేల కోట్లు, ఇరిగేషన్‌కు రూ.29 వేల కోట్లు కేటాయించనున్నట్లు సమాచారం. వైద్య శాఖకు రూ.15 వేల కోట్లు, విద్యుత్ శాఖకు రూ.15 వేల కోట్లు కేటాయించే చాన్స్ ఉంది. పేదలకు ఇళ్ల నిర్మాణానికి గాను ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు రూ.8 వేల కోట్లు కేటాయించనున్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News