TG Budget-2024 : అసెంబ్లీకి బయలు దేరిన కేసీఆర్

బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీకి హాజరు కావడంపై ఉత్కంఠ వీడింది.

Update: 2024-07-25 05:58 GMT

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీకి హాజరు కావడంపై ఉత్కంఠ వీడింది. కాసేపటి క్రితం కేసీఆర్ అసెంబ్లీకి బయలుదేరి వెళ్లారు. బడ్జెట్ సందర్భంగా సభకు గులాబీ బాస్ హాజరు కానున్నారు. తొలిసారి ప్రతిపక్ష నేత హోదాలో సభకు కేసీఆర్ అటెండ్ అవుతున్నారు. దీంతో కేసీఆర్ ఇంటి వద్ద కార్యకర్తలు సందడి చేశారు. కారు పార్టీ అధినేత వెంట ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, బీఆర్ఎస్ నేతలు బాల్కసుమన్, జీవన్ రెడ్డి తదితరులు ఉన్నారు. కాగా, బడ్జెట్ ప్రసంగం ముగిసిన వెంటనే కాళేశ్వరం సందర్శనకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వెళ్లనున్నారు. మరోవైపు రాష్ట్ర బడ్జెట్‌కు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. అనంతరం భట్టి సీఎం రేవంత్ రెడ్డికి బడ్జెట్ పద్దును అందజేశారు. ఆయన వెంట మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు.

Tags:    

Similar News