TG Assembly : కాంగ్రెస్ ఆ చట్టం తెచ్చి భూములు పంచింది.. మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు

1973లో కాంగ్రెస్ ప్రభుత్వం సీలింగ్ చట్టం తెచ్చి.. పేదలకు భూములను పంచిందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.

Update: 2024-08-02 07:33 GMT

దిశ, వెబ్‌డెస్క్: 1973లో కాంగ్రెస్ ప్రభుత్వం సీలింగ్ చట్టం తెచ్చి.. పేదలకు భూములను పంచిందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. భూమి హక్కులు, సంస్కరణలపై చర్చ సందర్భంగా మంత్రి పొంగులేటి శుక్రవారం అసెంబ్లీలో మాట్లాడారు. వైఎస్ హయాంలో పోడు భూములకు పట్టాలు ఇచ్చారని తెలిపారు. ప్రజలకు మంచి చేసిన వారి పేర్లు ప్రస్తావించడం సముచితం అన్నారు. భూ సంస్కరణలతో విప్లవాత్మక మార్పులు తెస్తామని అనేక మంది చెప్పారని.. ఇవాళ ఎక్కడ చూసినా భూ సమస్యలే కనిపిస్తున్నాయని గుర్తు చేశారు. గత ప్రభుత్వం తెచ్చిన ధరణి పోర్టల్ లోపభూయిష్టంగా ఉందని.. ధరణి తెచ్చిన సమస్యలకు పేద రైతులు అధికారుల చుట్టూ తిరిగారన్నారు. భూసంస్కరణలకు నాటి ప్రధాని ఇందిరాగాంధీ శ్రీకారం చుట్టారన్నారు. భూ సంస్కరణలతో అనేక విషయాలు అనుసంధానమై ఉన్నాయన్నారు. ప్రధానిగా ఉన్నప్పుడు పీవీ కూడా భూ సంస్కరణలు చేపట్టారన్నారు. ప్రపంచ చరిత్రలో నిలిచిన భూదాన ఉద్యమం ఇక్కడే పుట్టిందన్నారు.   


TG Assembly : క్రికెటర్ మహమ్మద్ సిరాజ్‌‌పై అసెంబ్లీలో CM రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

Tags:    

Similar News