TG Assembly : క్రికెటర్ మహమ్మద్ సిరాజ్‌‌పై అసెంబ్లీలో CM రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

స్పోర్ట్స్ కోటాలో నియామక బిల్లుపై అసెంబ్లీలో శుక్రవారం చర్చ జరిగింది.

Update: 2024-08-02 06:30 GMT

దిశ, వెబ్‌డెస్క్: స్పోర్ట్స్ కోటాలో నియామక బిల్లుపై అసెంబ్లీలో శుక్రవారం చర్చ జరిగింది. అంతకు ముందు స్పోర్ట్స్ కోటాలో నియామక బిల్లును డిప్యూటీ సీఎం భట్టి అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. క్రీడలకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందన్నారు. గతంలో లేని విధంగా రూ.361 కోట్లను స్పోర్ట్స్ కోసం కేటాయించామని తెలిపారు. ఇంటర్ పాసైన భారత క్రికెటర్ సిరాజ్‌కు ఉద్యోగం ఇస్తున్నామన్నారు. బాక్సర్ నిఖత్ జరీన్‌, సిరాజ్‌కు కూడా గ్రూప్-1 ఉద్యోగం ఇస్తున్నామన్నారు. చదువులోనే కాదు ఆటల్లో రాణించినా మంచి భవిష్యత్తు ఉంటుందని మా ప్రభుత్వం భరోసా కల్పిస్తోందన్నారు. వచ్చే సమావేశాల్లో స్పోర్ట్స్ పాలసీని తీసుకొస్తామన్నారు. మండలానికి ఒక మినీ స్టేడియం ఏర్పాటుపై ఆలోచిస్తున్నామన్నారు. బీసీసీఐతో ప్రాథమిక చర్చలు జరిపామన్నారు. అంతర్జాతీయ స్టేడియానికి కూడా స్థలం కేటాయిస్తామన్నారు. ఇప్పటికే స్టేడియం నిర్మించాలని బీసీసీఐని కోరామన్నారు.     

Tags:    

Similar News