టెన్త్ లీకేజీ కేసు : వరంగల్‌లో విచారణకు ఈటల
10వ తరగతి హిందీ పేపర్ వాట్సాప్ గ్రూపులో చక్కర్లు కొట్టగా రాజకీయ దుమారం లేపిన సంగతి తెలిసిందే.
దిశ, హన్మకొండ : 10వ తరగతి హిందీ పేపర్ వాట్సాప్ గ్రూపులో చక్కర్లు కొట్టగా రాజకీయ దుమారం లేపిన సంగతి తెలిసిందే. దీంతో బీఆర్‌ఎస్, బీజేపీ పార్టీల మధ్య మాటల యుద్ధం జరిగి అరెస్టుల వరకు దారి తీసింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ని వరంగల్ పోలీసులు అరెస్టు చేసి కరీంనగర్ జైలుకు తరలించారు. వరంగల్ కోర్టు బెయిల్ ఇవ్వడంతో విడుదల చేసారు. అయితే కమాలపూర్‌లో జరిగిన ఘటన ఆధారంగా ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కు వరంగల్ పోలీసులు నోటీసులు ఇవ్వగా సోమవారం వరంగల్ పోలీస్ కమిషనరేట్‌కు ఈటల వచ్చారు.
ఉదయం 11 గంటలకు రావాలసిన ఈటల కొంత ఆలస్యంగా 12:55 కు చేరుకొన్నారు. పోలీసులు కేవలం ఈటల రాజేందర్‌ను మాత్రమే లోనికి అనుమతిస్తామని చెప్పారు. కాగా తన లాయర్లను అనుమతించాలని ఈటల కోరడంతో విషయాన్ని ఉన్నతాధికారులకు పోలీసులు తెలియ జేశారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ సంబంధం లేని విషయంలో పోలీసులు ఇచ్చిన నోటీసుకు స్పందించనని విచారణకు వారికి సహకరిస్తానని చట్టం మీద గౌరవం ఉందన్నారు.
Also Read..
Minister Amarnath: మీ స్టాండ్ ఏంటో చెప్పండి.. సీఎం కేసీఆర్‌కు ప్రశ్నల వర్షం