టెన్షన్ టెన్షన్.. హాస్పిటల్ వద్దకు భారీగా TRS శ్రేణులు
సూరారం మల్లారెడ్డి నారాయణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌లో బుధవారం టెన్షన్ నెలకొంది.
దిశ, కుత్బుల్లాపూర్ : సూరారం మల్లారెడ్డి నారాయణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌లో బుధవారం టెన్షన్ నెలకొంది. రోగులు,వారి బంధువులతో కిటకిటలాడే హాస్పిటల్‌లో గురువారం ఉదయం ప్రజా ప్రతినిధులు, సెంట్రల్ రిజర్వ్ పోలీసులు, పొలిటికల్ లీడర్స్‌తో నిండిపోయి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి ఆస్తులపై, ఆయన కొడుకులు, బంధువుల ఇళ్లపై కేంద్ర ఆదాయం పన్నుశాఖ (ఐటీ ) అధికారులు మంగళవారం నుండి అక్రమ ఆస్తులు, లావా దేవీలపై దాడులు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే మంత్రి మల్లారెడ్డిపై ఐటీ శాఖ మూకుమ్మడి దాడులతో మంత్రి పెద్ద కుమారుడు మహేందర్‌రెడ్డి చాతి నొప్పి అంటూ అధికారులకు తెలపడంతో ఐటీ అధికారులు సూరారంలోని మల్లారెడ్డి హాస్పిటల్లో జాయిన్ చేసి చికిత్స అందిస్తున్నారు.
కుమారున్ని పరామర్శించడానికి మంత్రి మల్లారెడ్డి ఐటీ శాఖ అధికారులతో కలిసి హాస్పిటల్‌కు వచ్చారు. కొడుకు ఆరోగ్యం స్థితి గురించి డాక్టర్స్‌తో మాట్లాడి, కొడుకుతో కాసేపు ఉండి వెళ్లారు. సూరారం హాస్పిటల్‌కు మంత్రి మల్లారెడ్డి వచ్చిన విషయం తెలుసుకున్న మేడ్చల్ జిల్లా బీఆర్ ఎస్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద మంత్రిని, ఆయన కుమారుడిని పరామర్శించారు. అనంతరం మంత్రి వెంట ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే వెళ్లారు. ఐటీ దాడులు విషయం తెలుసుకున్న పలువురు టీఆర్‌ఎస్ శ్రేణులు మంత్రిని, మంత్రి కుమారుడిని పరామర్శించేందుకు హాస్పిటల్‌కు భారీగా వచ్చినప్పటికి సెంట్రల్ పోలీసులు అనుమతించలేదు.
Read More: 1. IT Raids: దాడులకు పక్కా స్కెచ్! అమ్మకానికి భూమి అంటూ Malla Reddy ఇంట్లోకి..
2. డస్ట్‌బిన్లలో సెల్‌ఫోన్ దాచాల్సిన అవసరమేంటి? : Raghunandan Rao