TG Assembly: అసెంబ్లీ వద్ద ఉద్రికత్త.. ఒక్కసారిగా దూసుకొచ్చిన ఉద్యోగులు

తెలంగాణ అసెంబ్లీ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సమగ్ర శిక్షా ఉద్యోగుల సంఘం చేపట్టిన ‘ఛలో అసెంబ్లీ’ని కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు.

Update: 2024-07-30 10:03 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ అసెంబ్లీ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సమగ్ర శిక్షా ఉద్యోగుల సంఘం చేపట్టిన ‘ఛలో అసెంబ్లీ’ని కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. మంగళవారం భారీ ర్యాలీగా అసెంబ్లీ భవనం వైపు దూసుకొచ్చిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. తమ డిమాండ్లు పరిష్కరించాలని ఈ సందర్భంగా ఉద్యోగులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మరోవైపు అసెంబ్లీ వేదికగా రైతులకు సీఎం రేవంత్ రెడ్డి రెండో విడత రుణమాఫీ చేశారు. ఈనెల 18న తొలి విడతలో లక్షలోపు రుణాలు మాఫీ చేయగా.. నేడు రెండో విడతలో భాగంగా రూ.లక్ష నుంచి రూ.లక్షన్నర వరకు రుణాలు తీసుకున్న రైతులకు మాఫీ చేశారు. ఈ దఫాలో దాదాపు 7 లక్షల మంది రైతుల అకౌంట్లలో డబ్బులు జమ చేశారు. అందుకు రూ. 7 వేల కోట్లు విడుదల చేశారు.

Tags:    

Similar News