ఆమె లేకుంటే.. KCR తలకిందులు తపస్సు చేసిన తెలంగాణ వచ్చేది కాదు: MP ఉత్తమ్
కాంగ్రెస్ పార్టీ లేకుంటే స్వరాష్ట్రం ఏర్పడకపోయేదని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం ఆయన గాంధీభవన్‌లో జరిగిన సభలో
దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ పార్టీ లేకుంటే స్వరాష్ట్రం ఏర్పడకపోయేదని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం ఆయన గాంధీభవన్‌లో జరిగిన సభలో మాట్లాడుతూ.. ప్రత్యేక రాష్ట్రం కోసం 1200 మంది బలిదానాలతో సోనియమ్మ చలించడం వలనే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందన్నారు. ప్రజల ఆంక్షాలకు పార్టీ మద్ధతు ఇచ్చిందన్నారు. లోక్సభ స్పీకర్‌గా మీరాకుమార్గతంలో తెలంగాణ పక్షాన నిలిచారన్నారు. అయితే రాష్ట్రపతి అభ్యర్థిగా ఆమె హైదరాబాద్‌కు వస్తే సీఎం కేసీఆర్ సపోర్టు చేయలేదన్నారు.
కనీసం ఫోన్ కూడా లిప్ట్ చేయలేదన్నారు. ప్రస్తుతం 9 ఏళ్లు గడిచినప్పటికీ, ఉద్యోగాల విషయంలో ఇప్పటికీ అన్యాయం జరుగుతూనే ఉన్నదన్నారు. ప్రజల ఆకాంక్షలను విస్మరించడం సరికాదన్నారు. సోనియా గాంధీ సహకరించకుంటే, కేసీఆర్ తలకిందులుగా తపస్సు చేసినా రాష్ట్రం వచ్చేది కాదని ఉత్తమ్ క్లారిటీ ఇచ్చారు. బిల్లు పాస్అయిన రోజు కేసీఆర్పార్లమెంట్లో లేరన్నారు. నేరేళ్ళ బాధితులను పరామర్శించేందుకు మీరాకుమార్ వస్తే, కేసీఆర్ అవహేళన చేశారన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్వేవ్ఉన్నదని, రాష్ట్రం ఇచ్చిన పార్టీకి ఒక అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఉన్నదని ఉత్తమ్ కోరారు.