కాంగ్రెస్ డిక్లరేషన్లను తెలంగాణ గిరిజనులు నమ్మరు: మంత్రి సత్యవతి రాథోడ్

చేవెళ్ల సభలో కాంగ్రెస్ ప్రకటించిన ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్లపై మంత్రి సత్యవతి రాథోడ్ స్పందించారు.

Update: 2023-08-27 06:58 GMT

దిశ, వెబ్‌డెస్క్: చేవెళ్ల సభలో కాంగ్రెస్ ప్రకటించిన ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్లపై మంత్రి సత్యవతి రాథోడ్ స్పందించారు. ఆదివారం ఆమె తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ నేతలు తప్పుడు డిక్లరేషన్ ప్రకటించారని అన్నారు. ఎస్సీ, ఎస్టీల కోసం దేశం మొత్తానికి ఇదే డిక్లరేషన్‌ను ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ప్రకటిస్తారా అని ఆమె ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్నాటక రాష్ట్రంలో ఇదే డిక్లరేషన్ అమలు చేస్తారా అని అడిగారు. చేవేళ్ల సభలో కాంగ్రెస్ ప్రకటించిన డిక్లరేషన్‌ను తెలంగాణ గిరిజనులు నమ్మరన్నారు. తెలంగాణ కాంగ్రెస్‌లో పది మంది నేతలు కలిసి ఉండే పరిస్థితి లేదని ఎద్దేవా చేశారు. సేవాలాల్ జయంతిని కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా అధికారికంగా నిర్వహించిందా అని ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ ఒక్క సంవత్సరంలోనే నాలుగు లక్షల మందికి పోడు భూముల పట్టాలు ఇచ్చారని.. ప్రతి నియోజకవర్గంలో గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేశారని అన్నారు.

Read More : చేతక్ బండిపై తిరిగిన జగదీశ్ రెడ్డికి వేల కోట్లు ఎక్కడివి..?...తన ఆస్తులు, మంత్రి ఆస్తులపై బహిరంగా చర్చకు సిద్ధం..

Tags:    

Similar News