రిటైర్డ్ ఉద్యోగులను వెంటనే తొలగించాలని తెలంగాణ స్టూడెంట్స్ అసోసియేషన్ డిమాండ్

రాష్ట్రంలో చాలా మంది రిటైర్డ్ ఉద్యోగులు అక్రమంగా కొనసాగుతున్నారని వీరిని వెంటనే తొలగించి సీనియర్ ఉద్యోగులకు ప్రమోషన్ కల్పించాలని తెలంగాణ స్టూడెంట్స్ అసోసియేషన్ అధ్యక్షులు,ఉస్మానియా యూనివర్సిటీ జె ఏ సి.ఎన్ఎం. శ్రీకాంత్ యాదవ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Update: 2024-08-14 16:47 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో చాలా మంది రిటైర్డ్ ఉద్యోగులు అక్రమంగా కొనసాగుతున్నారని వీరిని వెంటనే తొలగించి సీనియర్ ఉద్యోగులకు ప్రమోషన్ కల్పించాలని తెలంగాణ స్టూడెంట్స్ అసోసియేషన్ అధ్యక్షులు,ఉస్మానియా యూనివర్సిటీ జె ఏ సి.ఎన్ఎం. శ్రీకాంత్ యాదవ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఓయూ లో బుధవారం మీడియాతో మాట్లాడుతూ ..ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో వున్నా క్రమంలో అధికారంలోకి రాగానే ఒక్క పెన్ తో రిటైర్డ్ ఉద్యోగులను తొలగిస్తానని హామీని అయన గుర్తు చేశారు. వీరిని తొలగించడం మూలాన 10 ఏళ్లుగా ప్రమోషన్ కొరకు ఎదురు చూస్తున్నా సీనియర్ ఉద్యోగులకు అన్యాయం జరుగుతుందని, ప్రమోషన్ పొందకుండానే రిటైర్డ్ అవుతున్నారని తెలిపారు. అలాగే ప్రమోషన్ఏ ద్వారా ఏర్పడిన ఖాళీలను గ్రూప్ -1, గ్రూప్-2 ద్వారా భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.

రిటైర్డ్ ఉద్యోగులతో 18 వేల కోట్లు ?

రాష్ట్రంలో రిటైర్డ్ ఉద్యోగులు ఇంకా కొనసాగిస్తూ ప్రభుత్వం నెలకు 150 కోట్లు, సంవత్సరానికి రూ 1800 కోట్లు జీతాలు, అలవెన్సులు చెల్లిస్తున్నారని పేర్కొన్నారు. అంతేకాకుండా అవినీతి అక్రమాలు చేయడంలో ఆరితేరారని ఆరోపించారు. గత పది సంవత్సరాల్లో 18 వేల కోట్లు రిటైర్డ్ జలగలు జీతాలు, అలవెన్స్ రూపేణా దిగమింగారని ధ్వజమెత్తారు.

కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ఆదేశాల ప్రకారం ఆఘమేఘాల మీద 1050 మంది రిటైర్డ్ ఉద్యోగులను గుర్తించి నేటికి ఏడు నెలలు గడిచినప్పటికీ వారికి వున్న కుల బలగం, గాడ్ ఫాదర్ ల ఒత్తిడితో వారి పలుకుబడి ద్వారా కొనసాగుటకు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. తక్షణమే 1049 రిటైర్డ్ ఉద్యోగులను వెంటనే తొలగించాలని సీఎం రేవంత్ ఈ విషయంలో చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు.


Similar News