యూపీఎస్సీ ప్రిలిమ్స్ కోసం తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు!
యూపీఎస్సీ ప్రిలిమ్స్ పరీక్ష నేపధ్యంలో తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది.
దిశ, డైనమిక్ బ్యూరో: యూపీఎస్సీ ప్రిలిమ్స్ పరీక్ష నేపధ్యంలో తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్ష రాసే అభ్యర్ధులకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేయనుంది. జూన్ 16 న దేశవ్యాప్తంగా యూపీఎస్సీ ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించనున్నారు. ఈ నేపధ్యంలోనే తెలంగాణలో హైదరాబాద్, హన్మకొండ లలో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ పరీక్షకు హజరయ్యే అభ్యర్ధులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆర్టీసీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. దీని కోసం అభ్యర్ధులు బస్ స్టాప్ ల నుంచి నేరుగా పరీక్ష కేంద్రాలకు చేరుకునేలా అధికారులు ప్లాన్ చేస్తున్నారు.
అభ్యర్ధులకు మార్గనిర్దేశం చేసేందుకు ప్రధాన బస్ స్టాప్ ల వద్ద హెల్ప్ డెస్క్ లను ఏర్పాట్లు చేయనున్నట్లు తెలుస్తోంది. పరీక్ష సెంటర్లకు వెళ్లే బస్సుల వివరాల కోసం కోటి, రాథిపెల్ లలో కమ్యూనికేషన్ సెంటర్లు ఏర్పాటు చేసిన అధికారులు.. సమాచారం కోసం అభ్యర్ధులు సంప్రదించాల్సిన నంబర్లను కూడా వెల్లడించారు. కోటి: 9959226160, రాతిఫైల్ బస్ స్టేషన్: 9959226154 నంబర్ల ద్వారా సమాచారం తెలుసుకొవచ్చని అన్నారు. కాగా జూన్ 16 న యూపీఎస్సీ మొదటి పేపర్ ఉదయం 9.30 గంటల నుంచి 11.30 గంటల వరకు ఉండగా.. రెండవ పేపర్ మధ్యాహ్నం 2.30 గంటల నుండి 4.30 గంటల వరకు నిర్వహించనున్నారు.