మూడున్నర రోజుల్లోనే రూ. 40,232 కోట్లు.. దావోస్‌లో తెలంగాణకు పెట్టుబడుల వర్షం
ముఖ్యమంత్రి రేవంత్ స్వయంగా నేతృత్వం వహించి దావోస్‌లో మూడున్నర రోజుల పాటు వివిధ దేశ, విదేశీ కంపెనీల ప్రతినిధులతో చర్చలు జరిపిన అనంతరం
దిశ, డైనమిక్ బ్యూరో: ముఖ్యమంత్రి రేవంత్ స్వయంగా నేతృత్వం వహించి దావోస్‌లో మూడున్నర రోజుల పాటు వివిధ దేశ, విదేశీ కంపెనీల ప్రతినిధులతో చర్చలు జరిపిన అనంతరం కుదిరిన అవగాహనా ఒప్పందాలతో రాష్ట్రానికి రూ. 40,232 కోట్ల పెట్టుబడులకు లైన్ క్లియర్ అయింది. గతేడాది అప్పటి పరిశ్రమల మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో జరిగిన దావోస్ సమ్మిట్‌లో రూ. 19,900 కోట్ల మేరకు పెట్టుబడులపై ప్రభుత్వం నుంచి ప్రకటన వెలువడగా, దానికి ముందు సంవత్సరం (2021) రూ. 4,128 కోట్ల మేర పెట్టుబడులు వచ్చినట్లు రాష్ట్ర పరిశ్రమల శాఖ వర్గాలు పేర్కొన్నాయి. రికార్డు స్థాయిలో ఈ సంవత్సరం మూడున్నర రోజుల వ్యవధిలోనే రూ. 40,232 కోట్ల మేర రావడం విశేషం. గడచిన మూడు సంవత్సరాల్లో (2020-23) వచ్చిన మొత్తం (రూ. 24,528 కోట్లు)తో పోలిస్తే రూ. 15,704 కోట్లు ఎక్కువ.
రాష్ట్ర పరిశ్రమల శాఖ వర్గాల నుంచి వెలువడిన లెక్కల ప్రకారం ఏ సంవత్సరం దావోస్ సమ్మిట్‌లో రాష్ట్రానికి పెట్టుబడులు ఏ మేరకున్నాయి.
సంవత్సరం కోట్ల రూ.లలో
2020 500
2022 4,128
2023 19,900
2024 40,232
Read More..
లండన్ వేదికగా మూసీ ప్రక్షాళనకు CM రేవంత్ రెడ్డి మరో కీలక నిర్ణయం