తెలంగాణ పోలీసులు చెప్పిన కర్మ సిద్ధాంతం! వినూత్న తీరులో అవగాహన
ట్రాఫిక్ రూల్స్ పాటించాలని ఎన్నిసార్లు చెప్పినా కూడా కొందరు వాహనదారులు పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించి ప్రమాదాలకు కారకులవుతున్నారు.
దిశ, డైనమిక్ బ్యూరో: ట్రాఫిక్ రూల్స్ పాటించాలని ఎన్నిసార్లు చెప్పినా కూడా కొందరు వాహనదారులు పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించి ప్రమాదాలకు కారకులవుతున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ పోలీసులు వినూత్న తీరులో వాహనదారులకు అవగాహన కార్యక్రమాలు చేస్తున్నారు. తాజాగా తెలంగాణ పోలీసులు ట్విట్టర్ వేదికగా కర్మ సిద్ధాంతం గురించి వెల్లడించారు.
‘కర్మ సిద్ధాంతం! మనం మన పిల్లలకు ఎం నేర్పిస్తాం. అడుగులు ఎలా వేపిస్తాం. అదే మన భవిష్యత్ సమాజాన్ని నిర్దేశిస్తుంది. ఏదైనా వాహనాన్ని డ్రైవ్ చేస్తున్నప్పుడు మన పిల్లలు నిశితంగా గమనిస్తూ ఉంటారు. మనం ట్రాఫిక్ నియమాలు పాటించి వాళ్ళకి నేర్పినప్పుడే మన పిల్లల సమాజ తొలి అడుగులు బలంగా పడతాయి.’ అని తెలంగాణ కాప్స్ పేర్కొన్నారు. కాగా, ఈ సిద్ధాంతానికి నెటిజన్లు ఫిదా అయ్యారు.