TS: కానిస్టేబుల్ అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. ‘కీ’ విడుదలపై క్లారిటీ

తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ఇటీవల నిర్వహించిన అన్ని విభాగాల పోలీస్ కానిస్టేబుల్ ఫైనల్ రాతపరీక్షల ‘కీ’ని సోమవారం (మే 22) విడుదల చేయనున్నారు.

Update: 2023-05-21 14:38 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ఇటీవల నిర్వహించిన అన్ని విభాగాల పోలీస్ కానిస్టేబుల్ ఫైనల్ రాతపరీక్షల ‘కీ’ని సోమవారం (మే 22) విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో టీఎస్ఎల్పీఆర్బీ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది. వెబ్‌సైట్‌లో కానిస్టేబుల్‌ సివిల్‌, పీసీ డ్రైవర్‌, మెకానిక్‌, ట్రాన్స్‌పోర్ట్‌, ఎక్సైజ్‌, ఐటీ తత్సమాన పోస్టులకు సంబంధించిన ఫైనల్‌ రాతపరీక్షల ‘కీ’ని www.tslprb.inలో ఉంచనున్నట్లు వెల్లడించింది. ప్రాథమిక ‘కీ’లో అభ్యంతరాలు ఉంటే ఈ నెల 22 నుంచి 24 సాయంత్రం 5 గంటల్లోగా తెలియజేయాలని అభ్యర్థులకు సూచించింది.

‘కీ’ విషయంలో అభ్యంతరాలకు ప్రత్యేక ప్రోఫార్మా వెబ్‌సైట్‌లో ఉంచినట్లు తెలిపింది. ఫైనల్‌ ‘కీ’ని విడుదల చేసే సమయంలో ఓఎంఆర్‌ షీట్లు లాగిన్‌లో ఉంచనున్నట్లు పేర్కొది. అభ్యంతరాలకు సపోర్టింగ్ డాక్యుమెంట్‌లు, మెటీరియల్‌ను పీడీఎఫ్‌, జేపీఈజీ అప్‌లోడ్ చేయాలని వెల్లడించింది. ప్రతి వ్యక్తి (ప్రశ్న) అభ్యంతరం విడివిడిగా సమర్పించాలని, తగినంత సమాచారం లేని అభ్యంతరాలు పరిగణించబడవని, మాన్యువల్ పద్ధతి లేదని అభ్యర్థులకు సూచించారు.

Tags:    

Similar News