తెలంగాణ పార్లమెంట్ ఎన్నికలు: సాయంత్రం 5 గంటలకు 61.16 శాతం పోలింగ్ నమోదు

2024 పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా సోమవారం ఉదయం 7 గంటల నుంచి నాలుగో విడత ఎన్నికల పోలింగ్ జరుగుతుంది.

Update: 2024-05-13 12:22 GMT

దిశ, వెబ్‌డెస్క్: 2024 పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా సోమవారం ఉదయం 7 గంటల నుంచి నాలుగో విడత ఎన్నికల పోలింగ్ జరుగుతుంది. వేసవి కావడంతో ఉదయం నుంచి ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. దీంతో తెలంగాణ లోని అన్ని ప్రాంతాల్లో ఎన్నికల సందడిగా కొనసాగాయి. మధ్యాహ్నం 1 గంట వరకు 40. 38 శాతం పోలింగ్ నమోదు కాగా.. 3 గంటల వరకు మొత్తం తెలంగాణలో 52.34 శాతం పోలింగ్ నమోదైంది. అలాగే సాయంత్రం 5 గంటలకు 61.16 శాతం పోలింగ్ నమోదైంది. సాయంత్రం ఆరు గంటలకు పోలింగ్ ముగియనుండగా నిర్ణీత సమయంలోపు క్యూ లైన్లలో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పించనున్నారు.

సాయంత్రం 5 గంటల వరకు ఎంపీ నియోజకవర్గాల వారీగా పోలింగ్

ఆదిలాబాద్- 69.81

వరంగల్ - 64.08

మహబూబాబాద్ - 68.60

ఖమ్మం - 63.67

నల్గొండ - 70.36

భువనగిరి -72.34

మహబూబ్ నగర్ -68.40

నాగర్ కర్నూల్ - 70.36

జహీరాబాద్ - 71.91

చేవెళ్ల - 53.15

మల్కాజిగిరి - 46.27

సికింద్రాబాద్ - 42.48

హైదరాబాద్ -39.17

కరీంనగర్ - 67.67

ఖమ్మం -70.76

మెదక్ - 71.33

నిజామాబాద్ -67.96

పెద్దపల్లి - 63.౮౬

Read More..

Lok Sabha Polls 2024: సార్వత్రిక ఎన్నికల సిత్రాలు ఇవే.. ఉత్సాహం చూపని హైదరాబాదీలు 


Similar News