Mlc Kavitha Arrest: లిక్కర్ స్కామ్‌లో అరెస్ట్.. ఎమ్మెల్సీ కవిత సంచలన నిర్ణయం

తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ తనయ, ఎమ్మెల్సీ కవితను ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు....

Update: 2024-03-15 14:33 GMT

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ తనయ, ఎమ్మెల్సీ కవితను ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆమెను అధికారులు ఢిల్లీ తరలిస్తున్నారు. అయితే సుప్రీంకోర్టులో కేసు పెండింగ్‌లో ఉండగా తనను అరెస్ట్ చేయడాన్ని ఎమ్మెల్సీ కవిత తప్పుబడుతున్నారు. తన అరెస్ట్ అక్రమంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు శనివారం సుప్రీంకోర్టును కవిత ఆశ్రయించనున్నారు. ఇక కవిత అరెస్ట్‌ను సవాల్ చేస్తూ ఆమె తరపున లాయర్లు సుప్రీంకోర్టులో ఛాలెంజ్ పిటిషన్ దాఖలు చేయనున్నారు. అటు ఈడీ కోర్టులోనూ కవిత రిమాండ్‌ను చాలెంజ్ చేయనున్నారు. 

కాగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితురాలిగా ఉన్న ఎమ్మెల్సీ కవితను శుక్రవారం సాయంత్రం అరెస్ట్ చేశారు. పక్కాగా అరెస్ట్  చేయాలన్న స్కెచ్‌తో వచ్చిన ఈడీ అధికారులు ముందుగా కవిత నివాసంలో సోదాలు చేశారు. అనంతరం ఆమెను అదుపులోకి తీసుకున్నారు. 4 గంటలపాటు విచారించారు. అనంతరం కవితను అరెస్ట్ చేశారు. ఈ మేరకు కవితను ఢిల్లీ తరలిస్తున్నారు. శనివారం ఉదయం వైద్య పరీక్షల అనంతరం కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. 

Tags:    

Similar News