TG: నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పిన తెలంగాణ మంత్రి
నూతన సంవత్సరాన్ని (జనవరి 1) పురస్కరించుకుని మంత్రి కొండా సురేఖ(Konda Surekha) తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
దిశ, వెబ్‌డెస్క్: నూతన సంవత్సరాన్ని (జనవరి 1) పురస్కరించుకుని మంత్రి కొండా సురేఖ(Konda Surekha) తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. లక్ష్య సాధనకు ప్రయత్న లోపం లేకుండా కృషి చేస్తూ, అస్తిత్వం ప్రసాదించిన ఈ జీవితాన్ని ఆనందంగా స్వీకరించడమే అర్థవంతమైన జీవితమని మంత్రి అన్నారు. యువత తమ అభిరుచులు, ఇష్టాయిష్టాలు, సామర్థ్యం మేరకు లక్ష్యాలను నిర్ధారించుకుని, ఆశావహ దృక్పథంతో ముందుకు సాగాలని సూచించారు. ఈ నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరి ఆశలు, ఆకాంక్షలు నెరవేరాలని, అందరి జీవితాల్లో వెలుగులు నిండాలని మంత్రి ఆకాంక్షించారు.
ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా సమాజ శ్రేయస్సే లక్ష్యంగా పనిచేస్తున్న ఎలక్టానిక్, ప్రింట్ మీడియా మిత్రులకు మంత్రి సురేఖ ప్రత్యేకంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ఎజెండాగా సంక్షేమంలో స్వర్ణయుగం ఆవిష్కరించేందుకు గొప్ప సంకల్పబలంతో కార్యాచరణను అమలుచేస్తున్నదని మంత్రి సురేఖ స్పష్టం చేశారు.