'ఉన్నత విద్యలో తెలంగాణ టాప్.. జాతీయ సగటు కంటే స్టాండర్డ్స్‌లో బెటర్'

Update: 2023-06-20 16:33 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ఉన్నత విద్యా వ్యాప్తిలో జాతీయ సగటు కంటే ఎక్కువ మెరుగైన వృద్ధిని తెలంగాణా రాష్టం నమోదు చేసిందని ఉన్నత విద్య మండలి చైర్మన్ ప్రొ.ఆర్. లింబాద్రి పేర్కొన్నారు. తెలంగాణా దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా విద్యా దినోత్సవ వేడుకలు మంగళ వారం డా.బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో అయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. జాతీయ స్థాయిలో సగటు ఉన్నత విద్యను అభ్యసించే వారి సంఖ్య (జిఈఆర్ ) 27.3 శాతం ఉండగా అది తెలంగాణాలో జాతీయ సగటు కంటే చాల ఎక్కువ గా 39.1 శాతంగా ఉందని ఇది ఉన్నత విద్యా వ్యాప్తికి తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కృషికి నిదర్శనమని పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 30 ఎస్సి భాలికల హాస్టల్ లను , 22 గిరిజన భాలికల్ హాస్టల్ లను, ౩౩ బీసీ భాలికల హాస్టల్ లను ఏర్పాటు చేసిందని తద్వారా అందులో చదువుకున్న విద్యార్ధులు ఈ రోజు జాతీయ, అంతర్జాతీయ స్థాయి విశ్వవిద్యాలయాల్లో అడ్మిషన్‌లు పొంధగలుగుతున్నారని ఇది ప్రభుత్వ ఘనతగా అయన అభివర్ణించారు.

ఉన్నత విద్యా మండలి ఆధ్వర్యంలో అనేక సంస్కరణలు తెచ్చామని అందులో భాగంగానే దోస్త్ (డిఓఎస్‌టి), బకెట్ సిస్టం, క్లస్టర్ సిస్టం లని ఇవి జాతీయ స్థాయిలో అన్ని విద్యా సంస్థలను ఆకట్టుకుంటున్నట్లు వెల్లడించారు. డిగ్రీ స్థాయిలోనే విద్యార్ధులకు వృత్తి నైపుణ్య శిక్షణా కోర్సులపైన అవగాహన కల్పిస్తున్నట్లు వివరించారు .ప్రాధాన్యత క్రమంలో ఒక్కొక్క సమస్యను పరిష్కరిస్తూ ప్రభుత్వం ముందుకు పోతుందని త్వరలోనే విశ్వవిధ్యాలయాల సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి కేసీఆర్ పూనుకోనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికే పూర్తి స్థాయిలో అధ్యయనం చేసిందని కొన్ని పాలనా పరమైన అడ్డంకులు ఉన్నాయని త్వరలో అన్ని పరిష్కారం కానున్నట్లు అయన వెల్లడించారు.

విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య. కె. సీతారామారావు మాట్లాడుతూ.. తెలంగాణ మారూమూల ప్రాంతాల్లోని పేద విద్యార్ధులకు కూడా అతి తక్కువ ఫీజుతో తమ విశ్వవిద్యాలయం ద్వార ఉన్నత విద్యను అందించడం చాలా సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా తెలంగాణ విద్యాభివృద్ధి గురించి చర్చించుకోవడం ఒక గొప్ప అవకాశంగా అభిప్రాయపడ్డారు.

విశ్వవిద్యాలయ అకాడమిక్ డైరెక్టర్ ప్రొ. ఘంటా చక్రపాణి ప్రసంగిస్తూ.. తెలంగాణ ఉద్యమంలో విశ్వవిద్యాలయాల పాత్ర చాల గొప్పదని ప్రత్యేక రాష్ట్ర సాధన తర్వాత ఉన్నత విద్యా వ్యాప్తికి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న కృషిని ఆయన కొనియాడారు. ఈ సందర్బంగా పలు విభాగాల డైరెక్టర్లు తమ తమ విభాగాల్లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్ర సాధన తర్వాత సాధించిన అభివృద్ధి కార్యక్రమాలను నివేదించారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్, డా.ఎ.వి.ఆర్.ఎన్.రెడ్డి. ప్రొ. జి. రామ్ రెడ్డి సెంటర్ ఫర్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్, డైరెక్టర్ ప్రో. సుధారాణి, విద్యార్ధి సేవల విభాగం డైరెక్టర్ డా. ఎల్వీకే రెడ్డి, ఈ.ఎం.ఆర్.ఆర్.సి. డైరెక్టర్ ప్రొ. వడ్డాణం శ్రీనివాస్, సీఎస్టేడీ డైరెక్టర్ ప్రొ. ఆనంద్ పవార్, మెటీరియల్స్, పబ్లికేషన్స్ డైరెక్టర్, ప్రొ.గుంటి రవీందర్ , సికా డైరెక్టర్ ప్రొ.పి.మధుసూధన రెడ్డి తో పాటు అన్ని విభాగాల డైరెక్టర్స్, అధిపతులు, డీన్స్, బోధన మరియు భోదనేతర సిబ్బంది, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.


Similar News