దేశంలోనే అధిక పింఛన్లు ఇస్తోన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ: Minister Harish Rao
తెలంగాణ ప్రభుత్వం దివ్యాంగులకు రూ. 1000 ఆసరా పెన్షన్ పెంచడం పట్ల మంత్రి హరీష్ రావు ఆనందం వ్యక్తం చేశారు.
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ప్రభుత్వం దివ్యాంగులకు రూ. 1000 ఆసరా పెన్షన్ పెంచడం పట్ల మంత్రి హరీష్ రావు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా అధిక పెన్షన్లు ఇస్తోన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. దివ్యాంగుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని హరీష్ రావు తెలిపారు. కాగా, దివ్యాంగులకు రూ.1000 ఆసరా పెన్షన్ పెంచుతూ తెలంగాణ సర్కార్ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు ప్రభుత్వం దివ్యాంగులకు నెల రూ. 3016 ఆసరా పెన్షన్ ఇస్తుండగా.. తాజాగా మరో రూ. 1000 పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఇకపై దివ్యాంగులకు నెలకు రూ. 4016 పెన్షన్ ఇవ్వనున్నారు.