నిబంధనలు అతిక్రమించిన తెలంగాణ హోంమంత్రి భార్య (వీడియో)

ట్రాఫిక్‌లో పోలీసులు, అంబులెన్స్‌లు తప్ప మిగతా వాహనాలు సైరన్లు మోగించడం చట్టవిరుద్ధం అని అందరికీ తెలిసిందే.

Update: 2023-04-24 05:59 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ట్రాఫిక్‌లో పోలీసులు, అంబులెన్స్‌లు తప్ప మిగతా వాహనాలు సైరన్లు మోగించడం చట్టవిరుద్ధం అని అందరికీ తెలిసిందే. అయితే, ట్రాఫిక్ నుండి తప్పించుకునేందుకు మంత్రి మహముద్ అలీ భార్య చట్టవిరుద్ధంగా సైరన్ మోగించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. వాహనదారులకు ఇబ్బంది కలిగేలా, హోంమినిస్టర్ భార్యనని తనని ఎవరు ఆపుతారనే ధీమాతో ట్రాఫిక్‌లో సైరన్ మోగించారంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేస్తూ తెలంగాణ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దీనిపై హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ సోమవారం స్పందించారు. చట్టవిరుద్ధంగా సైరన్లను ఉపయోగించడం వల్ల ట్రాఫిక్ సమస్యలు, ట్రాఫిక్ నిర్వహణకు అంతరాయం కలుగుతోందని.. దానికి తాము ఏకీభవిస్తున్నట్లు తెలిపారు. నేటి నుంచి హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులను ఈ చర్యకు వ్యతిరేకంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించి అనధికార సైరన్లు వాడే అన్ని వాహనాలను అదుపులోకి తీసుకుని సీజ్ చేయాలని కోరారు. అంతేకాదు రోగులు లేకపోయినా, నకిలీ రోగులను తీసుకెళ్తున్న అంబులెన్స్‌లలో అక్రమంగా సైరన్‌లు వినియోగిస్తున్నట్లు సమాచారం అందితే తనిఖీ చేయాలని ఆదేశించారు. చట్టవిరుద్ధమైన సైరన్లను ఉపయోగించే వాహనాలకు సంబంధించిన రుజువులతో రిపోర్టు చేస్తూ ఉండాలని ప్రజలని ఆయన అభ్యర్థించారు.


Tags:    

Similar News