Breaking News : తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
తెలంగాణ ప్రభుత్వం(Telangana Govt) మరో ముఖ్య నిర్ణయం తీసుకుంది.
దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ ప్రభుత్వం(Telangana Govt) మరో ముఖ్య నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని మరో 8 వ్యవసాయం మార్కెట్ కమిటీ(Agricultural Market Committee)లకు పాలకవర్గాలను నియమిస్తూ జీవో జారీ చేసింది. హైదరాబాద్, మెట్పల్లి, కొడకండ్ల, పాలకుర్తి, హుజూరాబాద్, జైనూర్, కమలాపూర్, మద్నూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీలను నియమిస్తూ వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఓ ప్రకటన విడుదల చేశారు. కాగా రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 113 వ్యవసాయ మార్కెట్ కమిటీలను ప్రభుత్వం నియమించింది.