ప్రభుత్వం కీలక నిర్ణయం.. కమర్షియల్‌ ట్యాక్స్ కేసు సీఐడీకి బదిలీ

కమర్షియల్‌ ట్యాక్స్ స్కామ్ కేసుపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసును సీఐడీకి బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Update: 2024-07-29 15:20 GMT

దిశ, వెబ్ డెస్క్: కమర్షియల్‌ ట్యాక్స్ స్కామ్ కేసుపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసును సీఐడీకి బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ఈ కేసు పలు రాష్ట్రాలతో ముడిపడి ఉన్నందున కేసు సీఐడీకి బదిలీ చేస్తున్నట్లు చెప్పుకొచ్చింది. మొత్తం రూ.1400 కోట్ల కమర్షియల్‌ ట్యాక్స్ స్కామ్‌ జరిగిందని.. ఈ కేసుకు సంబంధించి.. తెలంగాణ మాజీ సీఎస్‌ సోమేష్‌కుమార్‌ సహా ఐదుగురిపై కేసు నమోదైంది. వీరంతా.. పన్ను ఎగవేతదారులకు సహకరించారని ఆరోపణలు ఉన్నాయి. తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఈ కేసును సీఐడీ విచారించనుంది.

కాగా తెలంగాణ రాష్ట్ర వాణిజ్యపన్నుల శాఖలో సుమారు రూ.1000 కోట్ల కుంభకోణం జరిగినట్టు ఫోరెన్సిక్ ఆడిట్‌లో వెల్లడైంది. ఈ మేరకు ఈ నెల 26న ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు మాజీ చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్‌ను ఏ-5గా చేర్చారు. వాణిజ్య పన్నుల శాఖకు అప్పట్లో కమిషనర్‌గా వ్యవహరించిన సోమేశ్ కనుసన్నల్లోనే హైదరాబాద్ ఐఐటీ రూపొందించిన సాఫ్ట్‌వేర్ ఆధారంగా ప్రభుత్వానికి రావాల్సిన నిధులు పక్కదారి పట్టి ఖజానాకు నష్టం జరిగినట్టు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. కమర్షియల్ ట్యాక్స్ జాయింట్ కమిషనర్ రవి కానూరి ఫిర్యాదు మేరకు ఆ శాఖలో పనిచేస్తున్న అదనపు కమిషనర్ (సేల్స్ టాక్స్) ఎస్సీ కాశీ విశ్వేశ్వరరావు (ఏ-1), డిప్యూటీ కమిషనర్ శివరామ్ ప్రసాద్ (ఏ-2), ప్రొఫెసర్ శోభన్‌బాబు (అసిస్టెంట్ ప్రొఫెసర్, ఐఐటీ హైదరాబాద్), ప్లియాంటో టెక్నాలజీస్ (ఏ-4)ను నిందితులుగా పేర్కొన్నారు. వీరిపై ఐపీసీలోని 406, 409, 120-బీ, ఐటీ యాక్టులోని సెక్షన్ 65 కింద ఎఫ్ఐఆర్ నమోదైంది.

Tags:    

Similar News