Mohammed Siraj : క్రికెటర్ మహ్మద్ సిరాజ్‌కు ఇంటిస్థలం.. ప్రభుత్వ ఉత్తర్వులు.. ప్లేస్ ఎక్కడంటే?

భారత క్రికెట‌ర్, హైదరాబాదీ మ‌హ్మ‌ద్ సిరాజ్‌కు తెలంగాణ ప్రభుత్వం ఇంటి స్థలం కేటాయించింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం తాజాగా జీవో జారీ చేసింది.

Update: 2024-08-09 13:10 GMT

దశ, డైనమిక్ బ్యూరో: భారత క్రికెట‌ర్, హైదరాబాదీ మ‌హ్మ‌ద్ సిరాజ్‌కు తెలంగాణ ప్రభుత్వం ఇంటి స్థలం కేటాయించింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం తాజాగా జీవో జారీ చేసింది. ఇటీవల టీ-20 వరల్డ్ కప్ గెలుపు తర్వాత హైదరాబాద్‌కు వచ్చిన సిరాజ్ రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఆ సమయంలో సిరాజ్‌పై ముఖ్యమంత్రి వరాలు కురిపించారు. సిరాజ్‌కు నగరంలో ఇంట స్థలంతో పాటు ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చేందుకు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే శుక్రవారం క్రికెట‌ర్ మ‌హ్మ‌ద్ సిరాజ్‌కు జూబ్లీహిల్స్‌లో 600 చదరపు గ‌జాల స్థ‌లం కేటాయిస్తూ రెవెన్యూ శాఖ ఉత్త‌ర్వులు జారీ చేసింది. అదేవిధంగా రెండు సార్లు వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్‌గా నిలిచిన తెలంగాణకు చెందిన బాక్సర్ నిఖత్ జరీన్‌కు కూడా సీరాజ్‌తో పాటు ప్రభుత్వం ఉద్యోగం.. నగదు ప్రోత్సాహకం ఇచ్చేందుకు ఇది వరకు జరిగిన మంత్రి మండలి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

Tags:    

Similar News