రిజిస్ట్రేషన్లపై గ్రీన్ ఫండ్ వసూలు.. తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
దిశ, తెలంగాణ బ్యూరో: ఇప్పటికే హరితహారం కోసం వివిధ రూపాల్లో పన్నులు వసూలు చేస్తున్నది. తాజా
దిశ, తెలంగాణ బ్యూరో: ఇప్పటికే హరితహారం కోసం వివిధ రూపాల్లో పన్నులు వసూలు చేస్తున్నది. తాజాగా ఆస్తి లావాదేవీల్లోనూ ఇక నుంచి తెలంగాణ గ్రీన్ ఫండ్ వసూలు చేయాలని నిర్ణయించింది. ప్రతి డాక్యుమెంట్ పైన రూ.50 మేరకు గ్రీన్ ఫండ్ వసూలు చేయాలని మంగళవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఐతే మార్చి ఒకటో తేదీ నుంచి వసూలు చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే పూర్తయిన డాక్యుమెంట్లపైన ఏ విధంగా వసూలు చేస్తారో తెలపలేదు. ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్టుమెంట్ సూచన మేరకు ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు ఉత్తర్వులో పేర్కొన్నారు. ఫీజు వసూలు ప్రక్రియను అమలు చేయాలని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ కమిషనర్ ను ఆదేశించారు.