BREAKING: తెలంగాణ కేబినెట్ భేటీకి ముహూర్తం ఫిక్స్

ఆగస్టు 1వ తేదీన తెలంగాణ కేబినెట్‌ భేటీ కానుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సాయంత్రం 4 గంటలకు మంత్రి మండలి సమావేశం జరగనుంది.

Update: 2024-07-25 11:22 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఆగస్టు 1వ తేదీన తెలంగాణ కేబినెట్‌ భేటీ కానుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సాయంత్రం 4 గంటలకు మంత్రి మండలి సమావేశం జరగనుంది. ప్రస్తుతం జరుగుతోన్న తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఆగస్ట్ 2వ తేదీన ముగియనున్నాయి. ఇవాళ (గురువారం) డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అసెంబ్లీలో 2024-2025 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ప్రవేశపెట్టగా.. బడ్జెట్‌పై చర్చ అనంతరం ద్రవ్య వినిమయ బిల్లుకు ఈ నెల 31వ తేదీన అసెంబ్లీ ఆమోదం తెలపనుంది. అనంతరం ఆగస్ట్ 2న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగియనున్నాయి. అయితే, అసెంబ్లీ సమావేశాల ముగింపుకు ఒక్క రోజు ముందే తెలంగాణ కేబినెట్ భేటీ కానుండటం ఆసక్తిగా మారింది. ఈ భేటీకి సంబంధించిన అజెండా ఏంటన్నది తెలియనప్పటికీ.. జాబ్ క్యాలెండర్, రైతు భరోసా గైడ్ లైన్స్‌కు సంబంధించిన టాపిక్స్‌పై కేబినెట్ డిస్కస్ చేయనున్నట్లు టాక్.


Similar News