Telangana Budget 2023: : ఆయా రంగాలకు కేటాయింపులు ఇవే!
మంత్రి హరీష్ రావు తెలంగాణ అసెంబ్లీలో సోమవారం రాష్ట్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టారు.
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అనంతరం బడ్జెట్ వివరాలను వెల్లడించారు. తెలంగాణ ఆచరిస్తున్నది. దేశం అనుసరిస్తోందంటూ హరీష్ రావు తన ప్రసంగాన్నిప్రారంభించారు. మంత్రి హరీష్ రావు తెలంగాణ అసెంబ్లీలో సోమవారం రాష్ట్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. మొత్తం రూ.2,90, 396 కోట్లతో రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇందులో రెవెన్యూ వ్యయం రూ.2,11, 685కోట్లు, నీటి పారుదల రంగానికి రూ.26,885 కోట్లు, విద్యుత్ రంగానికి రూ.12,727 కోట్లు కేటాయించారు. ప్రజాపంపిణీ వ్యవస్థకు రూ.3,117 కోట్లు, ఆయిల్ ఫామ్ సాగుకు రూ.1000కోట్లు, దళితబంధు పథకానికి రూ.17.700 కోట్లు, ఆసరా పెన్షన్లకు రూ.12,000కోట్లు కేటాయించారు.
Also Read..
Telangana Budget 2023: రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ ప్రభుత్వం